వచ్చే ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై ఆర్థికమంత్రి హరీశ్‌రావు ఇవాళ్టి నుంచి శాఖల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు. బడ్జెట్ ప్రతిపాదనలపై శనివారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం... వార్షికపద్దు, బడ్జెట్ అంచనాల కేటాయింపుల విధివిధానాలను ఖరారు చేశారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా హరీశ్‌రావు సమీక్ష - తెలంగాణ బడ్జెట్ ప్రతిపాదనలు
రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సమీక్ష చేయనున్నారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో అవసరాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై కసరత్తు చేస్తారు. వార్షిక పద్దు, కేటాయింపుల విధి విధానాలను సీఎం కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు.
![బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా హరీశ్‌రావు సమీక్ష Departmental Harish Rao Review on Budget Proposals](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10913817-459-10913817-1615158515863.jpg)
బడ్జెట్ ప్రతిపాదనలపై శాఖలవారీగా హరీశ్‌రావు సమీక్ష
ఆయా శాఖలతో సమావేశాలు నిర్వహించి శాఖల వారీ ప్రతిపాదనలను సమీక్షించాలని మంత్రి హరీశ్‌రావుకు తెలిపారు. అందుకు అనుగుణంగా ఇవాళ్టి నుంచి ఆర్థిక మంత్రి వివిధ శాఖలతో సమావేశాలు జరపనున్నారు. ఆయా శాఖల ప్రస్తుత కేటాయింపులు, ఇప్పటి వరకు చేసిన వ్యయంతోపాటు... వచ్చే ఆర్థిక ఏడాదిలో అవసరాలు, బడ్జెట్ ప్రతిపాదనలపై హరీశ్ కసరత్తు చేస్తారు.
ఇదీ చూడండి :బడ్జెట్లో కోతలు పెట్టినందుకు ఓట్లేయాలా?: హరీశ్ రావు