చరవాణి నుంచి రేడియేషన్ వెలువడుతుందని.. గరిష్ఠంగా 1.6 వాట్ ఫర్ కేజీగా నిర్దేశించిందని రాంచంద్ తెలిపారు. దీనికి లోబడే చరవాణులను తయారు చేయాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా 2 వాట్ ఫర్ కిలో వరకు అనుమతిస్తున్నారన్నారు. మీ ఫోన్లలో ఏ స్థాయిలో రేడియేషన్ ఉందో *#07# ద్వారా తెలుసుకోవచ్చని వివరించారు.
- ఫోన్‌లో గరిష్ఠంగా 1.6 వాట్ ఫర్ కేజీ
- ప్రపంచవ్యాప్తంగా 2 వాట్ ఫర్ కిలో
- *#07#ఈనంబర్‌ను మొబైల్లో ప్రెస్ చేసి రేడియోషన్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు
ఫోన్‌లో రేడియేషన్ పరిమితి ఎలా లెక్కిస్తారు..?
సెల్ టవర్ల పౌనఃపున్యం 900, 1800, 2100, 2300 మెగాహెడ్జ్ వరకు ఉంటున్నాయని రాంచంద్ తెలిపారు. స్తంభాలకు 50 మీటర్ల దూరం నుంచి రేడియేషన్ పరీక్షించినప్పుడు చదరపు మీటర్‌కు ఒక వాట్ వరకు ఉండొచ్చుని అంటున్నారు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్(ఐసీఎన్‌ఐఆర్‌పీ) నిర్దేశించిన ప్రమాణాల్లో పదో వంతుని స్పష్టంచేశారు. ఇప్పటివరకు డీవోటీ తనిఖీల్లో పరిమితికి లోబడి ఉన్నట్లు తేలిందన్నారు. కాబట్టి టవర్లతో ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు.