New zonal system in Telangana:కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన కోసం రాష్ట్ర ప్రభుత్వం విధివిదానాలు ప్రకటించింది. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన కోసం సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2018 రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన జరగనుంది.
New zonal system in Telangana: స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు విధివిధానాల ప్రకటన - స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజనకు విధివిధానాల ప్రకటన
11:57 December 06
కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన
employees bifurcation based on new zonal system: ఉద్యోగుల కేటాయింపు కోసం జిల్లా స్థాయి పోస్టులకు ఉమ్మడి జిల్లా కలెక్టర్, జోనల్, మల్టీ జోనల్ పోస్టులకు జీఏడీ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం పేర్కొంది. ఆయా శాఖల కార్యర్శులు, శాఖాధిపతులు, ఆర్థికశాఖ నుంచి సీనియర్ కన్సల్టెంట్, ఇతర సీనియర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎన్నికల కోడ్ లేని జిల్లాల్లో తక్షణమే ప్రక్రియ చేపట్టాలన్న ప్రభుత్వం.. మిగతా జిల్లాల్లో ఎన్నికల కోడ్ అనంతర ప్రక్రియ నిర్వహించాలని తెలిపింది.
employees bifurcation in telangana: ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలు తీసుకోనున్న ప్రభుత్వం.. సీనియార్టీ, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన జరగనుంది. ప్రత్యేక కేటగిరీల్లో భాగంగా 70 శాతానికి పైగా సమస్య ఉన్న దివ్యాంగులకు, పిల్లల్లో మానసిక దివ్యాంగులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లతో.. సీఎస్ సోమేశ్ కుమార్ దృశ్య మాద్యమ సమీక్ష నిర్వహించి షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. విభజన, కేటాయింపులో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత శాఖల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. కొత్తగా ఏర్పాటైన కొన్ని జిల్లాలు రెండు చొప్పున పాత జిల్లాల నుంచి ఏర్పడ్డాయి. జోనల్, మల్టీజోనల్కు సంబంధించి కూడా ఈ తరహా అంశాలు ఉన్నాయి. దీంతో జిల్లా, జోనల్, మల్టీజోనల్ కేటగిరీలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టత ఇచ్చి అనుబంధాలను వెలువరించింది.
ఇదీ చదవండి:New Zonal System in Telangana: ఈ నెలలోనే జోనల్ బదలాయింపులు..