విద్యా సంస్థలు మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేసిన పాఠశాలలకు విద్యా శాఖ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్ అబిడ్స్‌లోని లిటిల్ ఫ్లవర్ స్కూలు, గన్ ఫౌండ్రీలోని రోజరీ కాన్వెంట్, ఆల్ సెయింట్స్ హైస్కూలు, చార్మినార్ ప్రాంతంలోని వీఐపీ ఇంటర్నేషనల్, స్ప్రింగ్ ఫీల్డ్, సికింద్రాబాద్‌లోని శిరీన్ పబ్లిక్ స్కూల్, షేక్ పేటలోని ఝాషువా, సన్ రైజ్, కుష్బూ స్కూలు, బహదూర్ పురాలోని సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్ స్కూలు తెరిచి ఉండటంతో... అధికారులు వెళ్లి మూసివేయించారు.
ప్రభుత్వాదేశాలను బేఖాతరు చేసిన పాఠశాలలకు నోటీసులు - తెలంగాణలో కరోనా
విద్యా సంస్థలు మూసివేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన పాఠశాలలకు విద్యాశాఖ నోటీసులు ఇచ్చింది. చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ చిత్ర రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
corona virus
వాటిపై చర్యలు తీసుకునేందుకు నోటీసులు జారీ చేసినట్లు పాఠశాల విద్యా కమిషనర్ చిత్ర రామచంద్రన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు తనిఖీ చేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి:'అధికారం మీకే అప్పగిస్తాం... 50 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తారా?'