దీర్ఘకాలిక సెలవులో వెళ్లి సకాలంలో విధుల్లో చేరని ఉపాధ్యాయులు ఎందరున్నారు? అనధికారికంగా సెలవులు పెట్టి వెళ్లినవారు ఉన్నారా? సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యల కేసులు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి?.. ఇలాంటి అంశాలపై పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కోర్టు కేసులు పెరుగుతుండటంతో వాటిపై అధ్యయనం చేసి భవిష్యత్తులో అలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలకు పూనుకుంది.
విధులకు డుమ్మా కొట్టిన టీచర్లు ఎందరు? - తెలంగాణ తాజా వార్తలు
తెలంగాణలో విధులకు హాజరుకాని టీచర్లు ఎందరున్నారు? అనధికారికంగా సెలవులు పెట్టి వెళ్లినవారు ఉన్నారా? సస్పెన్షన్, క్రమశిక్షణ చర్యల కేసులు ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? అనే అంశాలపై విద్యాశాఖ ఫోకస్ చేసింది. వివరాలు పంపించాలని డీఈఓలను ఆదేశించింది.
How many teachers are absent from duty?
ఈ క్రమంలోనే ఈ వివరాలను వెంటనే పంపాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీదేవసేన డీఈవోలను ఆదేశించారు. వందల మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు/ఎంఈవోల అనుమతితో నాలుగు నెలల దీర్ఘకాలిక సెలవు పెడుతున్నారు. వారు తిరిగి విధుల్లో చేరడం లేదు. అదే సమయంలో సెలవులూ పొడిగించుకోవడం లేదు.
ఇదీ చదవండి:పర్యాటక రంగంపై కరోనా పిడుగు.. దుర్భర స్థితిలో గైడ్లు!