సైబర్ సెక్యూరిటీ సహా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో ఉద్యోగాలను అందిపుచ్చుకునేలా విద్యార్థులను సిద్ధం చేసేందుకు కళాశాల విద్యాశాఖ నాస్కామ్తో ఒప్పందం కుదుర్చుకుంది. కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్ సమక్షంలో సంయుక్త సంచాలకులు మంజులత, నాస్కామ్ ప్రతినిధి చింతల సంధ్య ఈ మేరకు ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు.
నాస్కమ్తో ఒప్పందం కుదుర్చుకున్న కళాశాల విద్యాశాఖ - nasscom agreement
సైబర్ సెక్యూరిటీ విభాగంలో నైపుణ్యం సాధించేలా విద్యార్థులను సిద్ధం చేసేందుకు కళాశాల విద్యాశాఖ నాస్కమ్తో ఒప్పందం కుదుర్చుకుంది. శిక్షణలో భాగంగా సాంకేతిక రంగాల్లో వివిధ ఉద్యోగావకాశాలు... ప్రత్యేకించి సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో ఉన్న అవకాశాలపై దృష్టి సారిస్తారు.
నాస్కమ్తో ఒప్పందం కుదుర్చుకున్న కళాశాల విద్యాశాఖ
ఒప్పందంలో భాగంగా గుర్తించిన అధ్యాపకులకు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తారు. నిపుణులైన అధ్యాపకులు విద్యార్థులకు ఆయా నైపుణ్యాల్లో తర్ఫీదునిస్తారు. సాంకేతిక రంగాల్లో ఉన్న వివిధ ఉద్యోగావకాశాలు, ప్రత్యేకించి సైబర్ సెక్యూరిటీ తదితర రంగాల్లో ఉన్న అవకాశాలపై దృష్టి సారిస్తారు. శిక్షణ పొందిన అధ్యాపకులు, విద్యార్థులకు ధ్రువపత్రాలు పంపిణీ చేస్తారు.