తెలంగాణ

telangana

ETV Bharat / state

ఈ బెలూన్​లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు - hyderabad based TIFR to Release 10 Balloon Flights With ISRO

సైంటిఫిక్‌ రీసెర్చ్​లో భాగంగా ఆకాశంలోకి వదిలే బెలూన్‌లు భూమిమీద పడిపోయి కనిపిస్తే వాటిని ఎవరూ తాకొద్దని... వెంటనే పోలీసులకు గానీ... దానిపై ఉన్న నంబరుకు గానీ సమాచారం అందించాలని అటమిక్​ ఎనర్జీ, ఇస్రో అధికారులు పేర్కొన్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ బెలూన్​లు దిగే అవకాశం ఉన్నట్లు వివరించారు.

e-balloons
ఈ బెలూన్​లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు

By

Published : Jan 21, 2020, 5:01 AM IST

Updated : Jan 21, 2020, 3:29 PM IST

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ అధికారులు, ఇస్రో ఆధ్వర్యంలో సైంటిఫిక్‌ పరిశోధనల నిమిత్తం 10 బెలూన్‌ ఫ్లయిట్స్‌ను ఈనెల పది నుంచి 30వ తేదీలోగా ఆకాశంలోకి వదలనున్నారు. వీటిలో హైడ్రోజన్‌ వాయువును నింపుతారు. వాటితో పాటు పరిశోధనలకు అవసరమైన పరికరాలు ఉంచినట్లు అధికారులు తెలిపారు. మొదటి బెలూన్‌ను ఈనెల మూడో వారంలో ఆకాశంలోకి వదిలేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు.

ఇవి సాధారణంగా రాత్రి సమయంలో ప్రారంభిస్తారు. భూమి నుంచి 30 నుంచి 42 కి.మీ. ఎత్తులో వీటిని పరిశోధనల నిమిత్తం నింగిలోకి వదిలారు. ఒక్కోబెలూన్‌లో అమర్చిన సైంటిఫిక్‌ పరికరాలు 10గంటల పరిశోధనల తర్వాత భూమిపైకి దిగుతాయి. రంగురంగుల ప్యారాచూట్‌లలో ఇవి కింది దిగే అవకాశం వుంది. ఈ బెలూన్‌లు హైదరాబాద్‌ నగరానికి 200 నుంచి 350కి.మీ. దూరంలో భూమి పైకి చేరుకుంటాయి. విశాఖపట్నం, హైదరాబాద్‌, షోలాపూర్‌, నార్త్‌ కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఇవి కిందికి దిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తెలంగాణలో ఈ జిల్లాల్లో దిగొచ్చు

మన రాష్ట్రంలోని ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, జగిత్యాల, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, కుమురం భీం ఆసిఫాబాద్​, మహబూబ్‌నగర్‌, మంచిర్యాల, మెదక్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్‌, నల్గొండ, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్‌, వనపర్తి, వరంగల్‌, యదాద్రి జిల్లాల్లో ఈ బెలూన్‌లు భూమిపైకి చేరే అవకాశం ఉంది.

ముట్టుకోకుండా... సమాచారమివ్వండి

ఇవి ఎవరికైనా కనిపిస్తే వాటిని తాకవద్దని అధికారులు హెచ్చరించారు. వెంటనే సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌కు కానీ, వాటిపై ఉన్న చిరునామాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. వాటిలోని పరికాలను తాకొద్దని... అందులోని కొన్ని పరికరాల్లో హై వొల్టేజ్‌ విద్యుత్‌ ప్రవహిస్తుందన్నారు. చాలా సున్నితమైన, విలువైన సైంటిఫిక్‌ డేటా అందులో ఉంటుందని, ఎవరైనా దానిని తెరిస్తే డేటా చెదిరిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఎవరైనా ఈ సమాచారాన్ని అధికారులకు చేరవేయాలని, దానికి ఎలాంటి పారితోషికం ఉండదని అన్నారు.

ఇదీ చూడండి: ప్రేమ కోసం హెచ్​ఆర్సీని ఆశ్రయించిన ప్రియుడు

Last Updated : Jan 21, 2020, 3:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details