కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దంత వైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడు కే.రాజేష్ రెడ్డి సూచించారు. రోగులకు చికిత్స చేసే సమయంలో దంత వైద్యులు కరోనా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయ పడ్డారు. వీలైతే మూడు వారాలపాటు దంత వైద్యులు తమ సేవలు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వైద్యం అందించాలన్నారు. ఒకవేళ వైద్యం అందించినా... తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
'కరోనా నేపథ్యంలో దంతవైద్యులు అప్రమత్తంగా ఉండాలి' - దంత వైద్యులకు తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడు కే.రాజేష్ రెడ్డి సూచనలు
దంతవైద్యులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ అధ్యక్షుడు కే.రాజేష్ రెడ్డి సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వైద్యం చేయాలని చెప్పారు.

'కరోనా పట్ల దంత వైద్యులు అప్రమత్తంగా ఉండాలి'