Dengue Fever Symptoms :డెంగీకి మూలం ఫ్లేవీవైరస్‌లు. వీటిల్లో ఉపజాతులున్నాయి. ఇవి ఆడ ఈజిప్టై దోమ కుట్టటం వల్ల మనుషులలో వ్యాపిస్తాయి. దోమలో వైరస్ ఉన్నా కొన్నిసార్లు జ్వరం రాదు . కొందరికి తెలియకుండానే ఎప్పుడో ఒకసారీ డెంగీ ఇన్‌ఫెక్షన్ వచ్చి ఉండొచ్చు. దీంతో వైరస్‌ను తట్టుకునే విధంగా యాంటీబాడీలు శరీరంలో వృద్ధిచెంది డెంగీ జ్వరం రాకుండా కాపాడతాయి.
వర్షాకాలంలో పిల్లలకు సీజనల్ వ్యాధుల ముప్పు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!!
Dengue Fever Symptoms :డెంగీ లక్షణాలు
- ఉన్నట్టుండి తీవ్రమైన జ్వరం
- కళ్ల వెనక నుంచి నొప్పి
- వాంతి, వికారం
- ఒళ్లు, కీళ్ల నొప్పులు
- రక్తంలో హిమటోక్రిట్ (హిమోగ్లోబిన్) ఎక్కువవటం.
- అదే సమయంలో ప్లేట్‌లెట్లు వేగంగా పడిపోవటం.
- కడుపు నొప్పి, ఆయాసం
- పొట్టలో లేదా ఛాతీలో నీరు పోగుపడటం
- విడవకుండా వాంతులు
- చిగుళ్ల వంటి భాగాల నుంచి రక్తం రావటం
- చర్మం మీద ఎర్రటి చుక్కల్లాంటి మచ్చలు
- రక్తపోటు పడిపోవటం, అపస్మారం
Dengue Fever Treatment :డెంగీ జ్వరం వచ్చిన తొలిదశలో పారాసిటమాల్ మాత్రలు వేస్తే తగ్గిపోతుంది. వాంతులు లేకపోతే ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని పట్టించాలి. తీవ్రస్థాయిలో వాంతులు అవుతుంటే.. వాటిని తగ్గించే మందులతో పాటు ఓఆర్‌ఎస్ ద్రావణాన్ని తాగించాలి. అప్పటికీ తగ్గకపోతే.. ముఖ్యంగా పిల్లలను డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్య బాగా తగ్గటం, రక్తం చిక్కబడటం వంటివి గలవారికి తరచూ రక్తం చిక్కదనాన్ని తెలిపే హిమటోక్రిట్/ప్యాక్డ్ సెల్ వాల్యూమ్, ప్లేట్‌లెట్ల సంఖ్య తెలుసుకోవటానికి రక్తపరీక్షల వంటివి చేస్తూ జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి.