సచివాలయ భవనాల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోంది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచి మెుదలైన పనులు... రాత్రి సమయంలోనూ కొనసాగాయి. మొత్తం 11 బ్లాకులకు సంబంధించిన కూల్చివేతలు గతంలోనే చేపట్టగా... 60 శాతానికి పైగా భవనాలు నేలమట్టం అయ్యాయి.
జోరందుకున్న సచివాలయ భవనాల కూల్చివేత పనులు - Demolition works of secretariat buildings are going
సచివాలయ భవనాల కూల్చివేతకు ఉన్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే 60 శాతానికి పైగా నిర్మాణాలు నేలమట్టం అయ్యాయి. మరోవైపు కూల్చివేత పనులతో సచివాలయ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.
జోరందుకున్న సచివాలయ భవనాల కూల్చివేత పనులు
దాదాపు 25 భారీ యంత్రాలు, 150 మంది కూలీలు భవనాలను కూల్చివేస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లోనే భవనాలన్నింటినీ నేలమట్టం చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. కూల్చివేతల నేపథ్యంలో సచివాలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.