అక్రమ కట్టడాలపై కన్నెర్ర జేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ భవనాల కూల్చివేతకై జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మాదాపూర్ గురుకుల భూముల్లో వెలసిన అక్రమ కట్టడాలను కూల్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు.
గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత - hyderabad updates
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మాదాపూర్లోని గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభించారు జీహెచ్ఎంసీ అధికారులు. స్థానికులు నిర్మాణాలను కూల్చొద్దని ఆందోళన చేపట్టారు.
![గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత Demolish of illegal construction on Gurukul Trust lands in madhapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8037203-1032-8037203-1594815212919.jpg)
గురుకుల ట్రస్ట్ భూముల్లో అక్రమ కట్టడాలు కూల్చివేత
స్థానికులు జీహెచ్ఎంసీ అధికారులను అడ్డుకుంటున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న స్థానిక కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ జీహెచ్ఎంసీ అధికారులను కూల్చొద్దని ధర్నా చేపట్టారు. మాదాపూర్ పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించారు.
ఇదీ చూడండీ:'సచివాలయం కూల్చివేతకు పర్యావరణ అనుమతులేవి?'
TAGGED:
hyderabad updates