తెలంగాణ

telangana

ETV Bharat / state

Bhatti: 'ఫోన్ల హ్యాకింగ్‌తో ప్రజాస్వామ్యానికి రక్షణ కరవు' - Bhatti on phone tapping

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాస్వామ్య ఉనికిని ప్రమాదం పడేశాయని ఆవేదన వెలిబుచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడిన ఆయన... దేశంలో రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టుల ట్యాపింగ్​కు గురయ్యాయని ఆరోపించారు.

democracy
హ్యాకింగ్‌

By

Published : Jul 20, 2021, 4:31 PM IST

దేశంలో భావ ప్రకటనా స్వేచ్ఛ లేకుండా పోతోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Clp Leader Bhatti Vikramarka) ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాట్లాడారు. ఫోన్ల హ్యాకింగ్‌తో ప్రజాస్వామ్యానికి రక్షణ కరువైందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ఫోన్ల హ్యాకింగ్‌పై మోదీ, అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఫోన్ల ట్యాపింగ్ (Phone Tapping) విధానానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి చెప్పాలని హితవు పలికారు. ఈనెల 22న చలో రాజ్‌భవన్ (Chalo Rajbhavan) కార్యక్రమం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. దళిత బంధు పథకాన్ని రాష్ట్రమంతా అమలు చేయాలని సూచించారు. ఒక్క హుజురాబాద్ కోసమే అయితే ఎన్నికల కోసమే అన్నట్లు చూడాల్సి ఉంటుందని భట్టి అన్నారు.

అందరి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఈ దేశ ప్రజాస్వామ్యానికే ఒక అభద్రతను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని వాస్తవాలు తెలియజేస్తున్నాయి. పెద్దఎత్తున పెగాసెస్ అనే స్పైవేర్ ద్వారా చాలా మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు, జర్నలిస్టుల ఫోన్ల ట్యాప్ అయ్యాయి. అది కూడా 2019 జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు సిటిజన్స్ ల్యాప్ మంక్స్ స్కూల్ ఆఫ్ టొరెంటో ఒక డీటైల్డ్ రిపోర్టును సబ్మిట్ చేసింది. ఇందుకు సంబంధించినటు వంటి ఆనాటి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ఆ కార్యాలయ సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని ఈ సంస్థ ద్వారా తెలుస్తోంది. ఇది ఆందోళనకు.. ఒక భద్రతా సమస్యలకు తెరలేపింది. ఇందుకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా జాతికి సమాధానం చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ట్యాపింగ్ చేసే విధానానికి స్వస్తి పలకాలి. ఒకవేళ ట్యాపింగ్ జరుగుతుంటే జాతికి క్షమాపణలు చెప్పాలి. రాహుల్ గాంధీ, ఆయన కార్యాలయ సిబ్బంది ఫోన్లు ట్యాపింగ్​ను ఖండిస్తూ ఈనెల 22న చలో రాజ్​భవన్ కార్యక్రమం చేపడతాం.

-- భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత

Bhatti: 'ఫోన్ల హ్యాకింగ్‌తో ప్రజాస్వామ్యానికి రక్షణ కరవు'

ఇదీ చదవండి:Koushik Reddy: 'ఈటలది స్వార్థ రాజకీయం... నాది సంక్షేమ మార్గం'

ABOUT THE AUTHOR

...view details