పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని పున:ప్రతిష్టించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పలువురు రాజకీయ ప్రముఖులు మద్ధతు తెలిపారు. దీక్ష మూడో రోజుకు చేరుకున్న సందర్భంగా రాష్ట్ర సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, ఏపీ సీపీఐ కార్యదర్శి రామకృష్ణలు అంబర్‌పేటలోని వీహెచ్ నివాసానికి వెళ్లారు.
వీహెచ్ దీక్షకు మద్ధతు తెలిపిన సీపీఐ నేతలు - Ambedkar statue in Panjagutta
పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. అంబర్‌పేటలోని తన నివాసం వద్ద దీక్షకు దిగిన వీహెచ్‌ను.. నేడు పలువురు నేతలు కలిశారు.
వీహెచ్ ఆమరణ నిరాహార దీక్ష
రాజ్యాంగం రూపొందించిన మహనీయుడు అంబేడ్కర్‌కు.. అవమానం జరిగిందని చాడ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. వీహెచ్ డిమాండ్ న్యాయమైనదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి.. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో.. ఎమ్మార్పీఎస్‌కు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన: భాజపా