తెలంగాణ

telangana

ETV Bharat / state

దిల్లీ లిక్కర్ స్కామ్‌.. ఇవాళ్టితో ముగియనున్న నిందితుల ఈడీ కస్టడీ

Delhi liquor scam update : దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐ సంయుక్త దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అభిషేక్, విజయ్‌నాయర్, శరత్‌చంద్రారెడ్డి, బినోయ్ బాబులను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శరత్‌చంద్రారెడ్డి, బినోయ్‌లు తీహాడ్ జైలులో ఉన్నారు. ఇవాళ వీరి బెయిల్‌ పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో విచారణ జరగనుంది. మరోవైపు అభిషేక్, విజయ్ నాయర్‌ల కస్టడీ గడువు ఇవాళ్టితో ముగియనుండటంతో మధ్యాహ్నం 2 గంటలకు వారిని ప్రత్యేక కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇంకోవైపు వీరికి బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సీబీఐ వేసిన పిటిషన్‌పై ఇవాళ దిల్లీ హైకోర్టు విచారణ జరిపింది.

Delhi liquor scam update
Delhi liquor scam update

By

Published : Nov 24, 2022, 12:33 PM IST

Delhi liquor scam update: దిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ, సీబీఐలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఈనెల 14 నుంచి ఈడీ కస్టడీలో ఉన్న అభిషేక్, విజయ్ నాయర్‌లను మద్యం కుంభకోణంలో మనీలాండరింగ్ వ్యవహారాలపై ప్రశ్నలడిగారు. ఇవాళ్టితో వీరి కస్టడీ గడువు ముగియనుండటంతో మధ్యాహ్నం 2 గంటలకు వీరిని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నారు. సీబీఐ విచారణ ముగియడంతో ఇప్పటికే అభిషేక్, విజయ్‌లకు ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు మంజూరు చేసిన విషయం తెలిసిందే.

Delhi liquor scam latest news: మరోవైపు శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ప్రత్యేక కోర్టు విచారణ జరపనుంది. అభిషేక్, విజయ్‌ల కస్టడీ అంశంపై విచారణ జరిగే సమయంలోనే శరత్, బినోయ్‌ల బెయిల్ పిటిషన్లపైనా విచారణ జరపనుంది. శరత్ చంద్రారెడ్డి, బినోయ్‌బాబుకు ప్రత్యేక కోర్టు ఈనెల 21న జ్యూడిషియల్ కస్టడీ విధించింది. ఈడీ అధికారులు వీరిని నవంబర్ 10న అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు తీహాడ్‌ జైలులో ఉన్నారు.

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అభిషేక్, విజయ్ నాయర్‌లకు ఈనెల 21న బెయిల్ మంజూరు చేసిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దిల్లీ హైకోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ వేశారు. వీరి బెయిల్ రద్దు అంశంపై దిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. అభిషేక్, విజయ్‌నాయర్‌కు నోటీసులు జారీ చేసింది. సీబీఐ పిటిషన్‌పై స్పందించాలని నోటీసుల్లో పేర్కొంది. విచారణకు సహకరించలేదని అభిషేక్, విజయ్‌నాయర్‌ను సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కస్టడీలో విచారణ అనంతరం ఇద్దరికీ 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు.

ABOUT THE AUTHOR

...view details