Delhi Liquor Scam Case : దిల్లీ మద్యం కుంభకోణం కేసు మనీలాండరింగ్ వ్యవహారంలో గతేడాది అరెస్టైన అభిషేక్ బోయినపల్లి.. తన అరెస్టు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు దిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను కొట్టివేయడంతో.. సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది. వాదనల సందర్భంగా పీఎంఎల్ఏ సెక్షన్ 19 పరిగణనలోకి తీసుకోకుండా అభిషేక్‌ను అరెస్ట్ చేశారని ఆయన తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గి పేర్కొన్నారు. సీబీఐ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత.. ఈడీ కేసులో అరెస్టు చేశారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
Delhi Liquor Scam: చిన్న ఆరోపణతో మొదలై.. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారి..
Delhi Liquor Scam Case Latest Updates : అభిషేక్ బోయినపల్లి లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 5 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించిన సుప్రీం.. ఈడీ కౌంటర్‌కు రిప్లై దాఖలు చేయాలని అభిషేక్ తరఫు న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు.. అభిషేక్ బోయినపల్లి బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ అధికారులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రూ.3.85 కోట్లు ఇండో స్పిరిట్స్ కంపెనీ నుంచి అభిషేక్‌కు బదిలీ అయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.