ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసి.. తమ పార్టీ పేరు దెబ్బతీస్తున్నారని 'అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు' మహబూబ్ బాషా పిటిషన్ దాఖలు చేశారు.
వైకాపా, ఎన్నికల సంఘానికి దిల్లీ హైకోర్టు నోటీసులు - వైఎస్సాఆర్ పార్టీ వివాదం
వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ప్రచారం చేసి.. తమ పార్టీ పేరు దెబ్బతీస్తున్నారని దిల్లీ హైకోర్టులో 'అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు' మహబూబ్ బాషా పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం ఈసీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైకాపా)కి దిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.
![వైకాపా, ఎన్నికల సంఘానికి దిల్లీ హైకోర్టు నోటీసులు delhi-high-court-notices-to-election-commission-and-ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8004709-606-8004709-1594620704999.jpg)
ఈసీ, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైకాపాకు, ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.
ఇదీచూడండి: రాబోయే రోజులు మరింత జాగ్రత్తగా ఉండాలి... రంగంలో స్వర్ణలత