వైకాపా గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. అన్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈ పిటిషన్ వేశారు. మరోవైపు... వైఎస్‌ఆర్ పేరు వాడే హక్కు తమకు ఉందంటూ వైకాపా సైతం వాదనలు వినిపించింది.
'వైకాపా గుర్తింపు రద్దు పిటిషన్'పై దిల్లీ హైకోర్టులో విచారణ - దిల్లీ హైకోర్టులో అన్న వైఎస్‌ఆర్ పిటిషన్ న్యూస్
వైకాపా గుర్తింపు రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. వైఎస్‌ఆర్ పేరును వైకాపా వాడకుండా చూసేలా చూడాలని పిటిషనర్ పేర్కొన్నారు.

'వైకాపా గుర్తింపు రద్దు పిటిషన్'పై దిల్లీ హైకోర్టులో విచారణ
కానీ... 'వైఎస్‌ఆర్' పదాన్ని ఈసీ తమకు కేటాయించిందని.. మహబూబ్ బాషా తరఫున న్యాయవాది స్పష్టం చేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది.
ఇదీ చదవండి:ఏపీలో కొత్తగా 2,331 కరోనా కేసులు నమోదు.. 11 మంది మృతి