Delay in TS Teaching Posts Notification due to Technical Issue : రాష్ట్రంలోని గురుకులాల్లో దాదాపు 11 వేలకు పైగా ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టుల ఉద్యోగ ప్రకటనలకు సాంకేతిక అడ్డంకులు ఎదురవుతున్నాయి. గురుకుల నియామక బోర్డుకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, సాధారణ సొసైటీలు.. జోన్లు, మల్టీజోన్ల వారీగా ప్రతిపాదనలు సమర్పించి దాదాపు నెల రోజులు దాటింది. అయితే బీసీ గురుకుల సొసైటీ నుంచి ప్రతిపాదనలు ఆలస్యం కావడంతో ప్రకటనల జారీలో జాప్యం జరుగుతోంది.
Delay in Telangana Teaching Posts Notification : బీసీ గురుకులాల్లో ఈ విద్యా సంవత్సరంలో మంజూరైన నాలుగు జూనియర్ కళాశాలలు, 33 గురుకుల పాఠశాలలు, 15 బీసీ డిగ్రీ కళాశాలల్లో 2,591 పోస్టులకు సీఎం, మంత్రి మండలి ఆమోదం లభించినప్పటికీ ఆర్థికశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడలేదు. ఈ నేపథ్యంలో బీసీ గురుకుల సొసైటీ సిద్ధం చేసిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లలేకపోతోంది. ఉద్యోగ ప్రకటన ఆలస్యమైతే, వచ్చే విద్యాసంవత్సరానికి సంక్షేమ గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొంటుందని సంక్షేమ సొసైటీ వర్గాలు పేర్కొంటున్నాయి.