ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌పై విడుదల వాయిదా - ap latest news
![ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌పై విడుదల వాయిదా MP Raghuram Krishnaraja's release postponed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11876557-817-11876557-1621843799096.jpg)
12:43 May 24
ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్‌పై విడుదల వాయిదా
ఆంధ్రప్రదేశ్ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు విడుదల వాయిదా పడింది. సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న రఘురామ ఆరోగ్య పరిస్థితిని గుంటూరు జిల్లా కోర్టు మేజిస్ట్రేట్ అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి సమ్మరీని కోరారు. ఈ క్రమంలో ఎంపీకి మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మేజిస్ట్రేట్‌కు తెలిపారు. దీంతో వైద్యుల తుది నివేదిక ఇచ్చిన తర్వాతే రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ నెల 21న సుప్రీంకోర్టు ఎంపీకి బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. గుంటూరులోని ట్రయల్ కోర్టులో కేసు నడుస్తుండటంతో పాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉండటం వల్ల ఎంపీ విడుదలకు ఈ ప్రక్రియ జరగాల్సి ఉంది. రఘురామను ఈరోజు విడుదల చేసే అవకాశం ఉండటంతో తొలుత ఆయన తరఫు న్యాయవాదులు గుంటూరు జిల్లా కోర్టుకు వెళ్లారు. నేరుగా ఆర్మీ ఆస్పత్రి నుంచి రఘురామను విడుదల చేయాలని న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. మరో నాలుగు రోజులు వైద్యం అవసరమని ఆర్మీ ఆస్పత్రి వైద్యులు మెజిస్ట్రేట్‌కు తెలపడంతో రఘురామ విడుదల వాయిదా పడింది.
ఇదీ చూడండి:కరోనా ఎఫెక్ట్: రవాణాశాఖలో తగ్గిన వాహనాల కొనుగోళ్లు