రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలతోపాటు డిగ్రీ కళాశాలల్లోనూ డిమాండ్ మేరకు ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలని సర్కారు భావిస్తోంది. ఎక్కడెక్కడ అవసరమో అన్న వివరాలను.. ఆర్థికశాఖ అడిగిన ఫార్మాట్‌లో ఇంటర్, కళాశాల విద్యాశాఖ కమిషనర్లు అందించాలని ఉన్నత విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి ఎస్.సుమలత కోరారు. అందుకు తగ్గట్లుగా సంస్కృత అధ్యాపక పోస్టులను మంజూరు చేయాల్సి ఉంటుందని మెమో జారీ చేశారు.
SANSKRIT IN DEGREE: డిగ్రీలోనూ సంస్కృతం చదవాలనుందా.. అయితే వివరాలు పంపండి?
ఇంటర్ కళాశాల విద్యార్థులకే కాకుండా డిగ్రీ విద్యార్థులకు కూడా సంస్కృతాన్ని చదువుకునే వీలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం విద్యాశాఖ కమిషనర్లకు.. వివరాలు పంపమని ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు ఆదేశాలు జారీ చేసింది.
డిగ్రీలోనూ సంస్కృతం చదవాలనుందా.. అయితే వివరాలు పంపండి?
తాజాగా సాధారణ జూనియర్, డిగ్రీ కళాశాలలతోపాటు ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీ, రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశపెట్టేందుకు ఆయా వివరాలు సమర్పించాలని కోరటం గమనార్హం.
ఇదీ చూడండి:OPEN BOOK TEST: వాళ్లు పుస్తకాలు చూసి పరీక్షలు రాయొచ్చు..!