తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్పొరేటర్‌గా ఎన్నికైన 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని - degree student elected as a corporator news

ఏపీ కర్నూలు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని కార్పొరేటర్‌గా ఎన్నికైన అరుదైన ఘటన చోటుచేసుకుంది. కర్నూలులో 35వ వార్డులో మాధురి అనే యువతి ఏకగ్రీవం అయ్యారు. 21 ఏళ్లకే ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం దక్కించుకున్నారు.

degree student elected as a corporator in kurnool district
కార్పొరేటర్‌గా ఎన్నికైన 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని

By

Published : Mar 4, 2021, 10:38 AM IST

కార్పొరేటర్‌గా ఎన్నికైన 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని

డిగ్రీ విద్యార్థిని కార్పొరేటర్‌గా ఎన్నికైన అరుదైన ఘటన.. ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో చోటుచేసుకొంది. నగరంలోని 34, 35 వార్డుల్లో ఇతర పార్టీల వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నందున వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

34వార్డులో ఎరుకల వెంకటేశ్వర్లు.. 35వ వార్డులో మాధురి అనే యువతి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధురి.. 21 సంవత్సరాల వయసుకే ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం దక్కించుకొంది.

ABOUT THE AUTHOR

...view details