తెలంగాణ

telangana

ETV Bharat / state

15న దోస్త్ నోటిఫికేషన్... అంతా ఆన్​​లైన్​లోనే - 15న దోస్త్ నోటిఫికేషన్... అంతా ఆన్​​లైన్​లోనే

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌)’ ద్వారా డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 10వ తేదీకి బదులు 16 నుంచి మొదలుకానుంది. తొలుత మే 9న దోస్త్‌ ప్రవేశ ప్రకటన జారీ చేస్తామని, 10 నుంచి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించారు. ఇంటర్‌ పునఃపరిశీలన పూర్తయినా ధ్రువపత్రాలు రావడానికి మరికొన్ని రోజులు ఆలస్యమవుతుందని భావించిన విద్యాశాఖ ఆరు రోజులపాటు దోస్త్‌ ప్రక్రియను వాయిదా వేయాలని నిర్ణయించింది.

15న దోస్త్ నోటిఫికేషన్... అంతా ఆన్​​లైన్​లోనే

By

Published : May 7, 2019, 12:07 PM IST

డిగ్రీ ఆన్ లైన్ ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్​ను ఈనెల 15న జారీ చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈనెల 16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. ఇంజినీరింగ్ తరహాలో డిగ్రీలో కూడా ఈ ఏడాది నుంచి.. ఆన్ లైన్ లోనే కళాశాలలకు రుసుము చెల్లించి.. రిపోర్టు చేసే విధానం అమలు కానుంది. జూలై ఒకటి నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభించి అన్ని విశ్వవిద్యాలయాలు ఒకే షెడ్యూలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

16నుంచి దోస్త్​ అందుబాటులోకి...

ఈనెల 9నే దోస్త్ నోటిఫికేషన్ జారీ చేయాలని ముందుగా భావించినప్పటికీ... ఇంటర్ ఫలితాల రీవెరిఫికేషన్ కొనసాగుతున్నందున... 15వ తేదీకి వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈనెల 16 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఇంజినీరింగ్​ తరహాలోనే...

డిగ్రీ ప్రవేశాల ప్రక్రియపై సచివాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ ఛైర్మన్ పాపిరెడ్డి, తదితరులతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాది నుంచి సీటు దక్కిన కళాశాలలకు ఫీజు చెల్లింపు, రిపోర్టు చేసే విధానం అమలు చేయాలని నిర్ణయించారు. సీటు పొందిన తర్వాత కళాశాలకు వ్యక్తిగతంగా వెళ్లి రిపోర్టు చేసే విధానం ఇప్పటి వరకు ఉంది. ఇంజినీరింగ్ తరహాలో ఆన్​లైన్ రిపోర్టింగ్ విధానం అమలు చేయనున్నారు.

టీవాలెట్​ ద్వారా ఫీజు చెల్లింపు..

టీ వాలెట్ ద్వారా ఫీజు చెల్లించే సదుపాయాన్ని కొత్తగా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ప్రవేశాల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించేందుకు పాత జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య లింబాద్రి తెలిపారు.
తరగతులు, పరీక్షల నిర్వహణ, సెలవులు, తదితర షెడ్యూలు అన్ని విశ్వవిద్యాలయాల్లో ఒకే తీరుగా ఉండేలా చర్యలు తీసుకోనున్నారు.

15న దోస్త్ నోటిఫికేషన్... అంతా ఆన్​​లైన్​లోనే

ABOUT THE AUTHOR

...view details