తెలంగాణ

telangana

ETV Bharat / state

​హైదరాబాద్​ యువకుల అద్భుత సృష్టి.. వర్చువల్ రియాల్టీతో.. డీప్​లూప్ - Deeploop Software

DeepLoop software by Hyderabad youth: ఇంజినీరింగ్‌ పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి కార్పొరేటు సంస్థలు శిక్షణ ఇచ్చేందుకు పెద్ద మెుత్తంలో ఖర్చు చేస్తుంటాయి. నాలుగేళ్లు మెుత్తం సబ్జెక్ట్ చదివినప్పటికీ పూర్తి స్థాయిలో పనితీరు అర్థం కావాలంటే వారికి ట్రైనింగ్‌ అవసరం అవుతుంది. మరి అప్పుడే పాస్‌ అయ్యి ఉద్యోగాలకు వచ్చిన ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు పలు అంశాలపై అవగాహన కల్పించేందుకు కొన్ని ఇబ్బందులు, ఖర్చులు ఉంటాయి. ఆ ఖర్చును తగ్గిస్తూ వీఆర్​తో ట్రైనింగ్‌ ఇచ్చే సాఫ్ట్​వేర్​ను రూపొందించారు హైదరాబాద్‌కు చెందిన సూర్య ప్రకాశ్‌, చంద్రధర్‌. దాని పేరే డీప్‌లూప్‌....సరికొత్త సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఇద్దరు యువకులు తయారు చేసిన సాఫ్ట్‌వేర్‌ డీప్‌లూప్‌పై ప్రత్యేక కథనం.

DeepLoop
DeepLoop

By

Published : Apr 8, 2023, 12:17 PM IST

హైదరాబాద్​ యువకుల అద్భుత సృష్టి.. వర్చువల్ రియాలిటీతో.. డీప్​లూప్

DeepLoop software by Hyderabad youth: ప్రపంచంలో రోజురోజుకు సాంకేతికతలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న సాంకేతికతలను ఉపయోగించుకుంటూ వినూత్న ఆలోచనలతో అంకురాలు పుట్టుకొస్తున్నాయి. అలాంటి ఒక వినూత్న ఆలోచనే సుర్య ప్రకాశ్‌, చంద్రధర్‌లకు వచ్చింది. డీప్‌లూప్​ పేరుతో సరికొత్త సాఫ్ట్‌వేర్​ను రూపొందించారు. ఆటోమెబైల్‌ సంస్థలకు, విద్యాసంస్థలకు ఈ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడేలా రూపొందించారు. మెకానికల్‌ విద్యార్థులకు ల్యాబ్‌లో రాసే పరీక్షలను విఆర్‌ ద్వారా నడిపించే ఆలోచన అందరినీ ఆకట్టుకుంది.

అవతార్​లతో హాజరు..కరోనా సమయంలో వచ్చిన ఈ ఆలోచన ఇప్పుడు ఎందరో విద్యార్థులకు ఉద్యోగులకు శిక్షణ ఇవ్వటంలో ఉపయోగపడుతోంది. పూర్తిగా ల్యాబ్‌లో నడిచే పరీక్షలు వంటివి తరగతికి వెళ్లకుండా...ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడినట్లు ఒ సాఫ్ట్‌వేరును రూపొందించారు. ఈ ఆన్‌లైన్‌ ల్యాబ్‌లో తరగతి గదిలో ఉన్నట్లుగానే విద్యార్థులంతా కలిసి పనిచేయవచ్చు, నేర్చుకోవచ్చు.

వి ఆర్‌ హెడ్‌ సెట్లు వేసుకుని అందురు విద్యార్థులు ఒక సెర్వర్‌లో లాగ్‌ఇన్‌ అయ్యి ల్యాబ్‌ క్లాస్‌కు మెటావెర్స్‌లో తమ అవతార్​లతో హాజరుకావచ్చు. అలాగే ఉద్యోగంలో శిక్షణ ఇచ్చే ఆటోమోబైల్‌ సంస్థలకు కూడా డీప్‌లూప్‌ సాఫ్ట్‌వేరును అందిస్తోంది. బైట్‌ ఎస్సెంబుల్‌ చేయటం వంటి శిక్షణలు విఆర్‌ ద్వారా నేర్పుస్తూ...తక్కువ ఖర్చుతో ఈ యువకులు సులభతరం చేస్తున్నారు....మరి ఆ విఆర్‌తో శిక్షణ ఎలా ఇస్తున్నారో వారి నుంచే తెలుసుకుందాం.

విభిన్న రంగాలలో వినియోగం..చంద్రధర్, సూర్య ప్రకాశ్‌లు ఇద్దరూ కలిసి ఒకే కాలేజీలో కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ చదువుకున్నారు. ఏదైనా కొత్తగా చేయాలన్న ఆలోచనతో చందువుకుంటూనే కొన్ని ఆన్‌లైన్‌ గేమ్స్‌ రూపొందించారు. ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడప్పుడే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ, వి ఆర్‌లకు ఆదరణ లభిస్తుందటంతో వారిద్దరి దృష్టి అటువైపు మళ్లింది. దాదాపు సంవత్సరం పాటు అన్ని అంశాలను గమనించారు. ఆ సాంకేతికతలను ఉపయోగించి, సరికొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో 2021 లో డీప్‌లూప్‌ను స్థాపించారు.

ఆ దశలో వారి ఆలోచన నచ్చి, వారితో కలిసి పనిచేసేందుకు చంద్ర దాసరి ముందుకొచ్చారు. అలా ప్రారంభమైన డీప్‌లూప్‌ను ఇప్పుడు దాదాపు 20 కు పైగా సంస్థలు వాడుతున్నాయి. పూర్తిగా వి ఆర్‌ ద్వారా నడిచే ఈ శిక్షణ నేర్చుకునే వారికి ఆసక్తికరంగా ఉంటుందని సుర్యప్రకాశ్‌ అంటున్నారు. కేవలం ఆటోమోబైల్‌ రంగంలోనే కాకుండా హెల్త్‌కేర్‌ రంగంలో శిక్షణ ఇచ్చేందుకు కూడా డీప్‌లూప్‌ ఉపయోగపడుతోందని చెబుతున్నారు.

పెరుగుతున్న ఆదరణ..టీవీఎస్‌ వంటి పెద్ద సంస్థలకు శిక్షణ ఇవ్వటంతో పాటు కొన్ని సంస్థల మార్కెటింగ్‌లోనూ ఈ సాంకేతికత ఉపయోగపడుతోంది. తెలంగాణ స్టేట్‌ కాంక్లేవ్‌లో మూడో స్థానం, రెనో టాప్‌ 10 ఇన్నోవేటర్స్, మారుతీ ఎంఏఐఎల్‌ ఫైనలిస్టుగా, గ్రామీణ ఫౌండేషన్‌ టీఎస్‌ఐ ఛాలెంజ్‌లో రెండో స్థానం పొందారు. ఏడాదిన్నర కిందట 22 మందితో ప్రారంభించిన సంస్థ ప్రస్తుతం హైదరాబాద్‌లోని జి నారాయణమ్మ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఇన్‌క్యుబేట్‌ అవుతున్నారు.

ప్రస్తుతం 20కుపైగా సంస్థలు తమ సాఫ్ట్‌వేర్‌ లైసెన్స్‌ తీసుకున్నట్లు వ్యవస్థాపకుడు సూర్యప్రకాశ్‌ తెలిపారు. ప్రస్తుతం విఆర్‌ ద్వారా శిక్షణ ఇచ్చే సాఫ్ట్‌వేర్​ను రూపొందించిన యువకులు రానున్న రోజుల్లో ఐఓటి ఆధారిత పరికరాలను ఉరయోగిస్తూ శిక్షణ ఇచ్చే సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు చూస్తున్నామని తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details