తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫుడ్‌ బ్లాగర్‌ టు ఫుడ్‌ కోర్టు వైపు సాగిన ఓ యువకుడి ప్రస్థానం - దేశీ చినీ ఫుడ్ ట్రక్‌ తాజా వార్తలు

Deepak Belel Food Blogger: తెల్లారితే ఇంజినీరింగ్‌ పరీక్ష. కానీ రాత్రి 12 గంటలకు హాయిగా ఓ రెస్టారెంట్‌లో ఐస్‌క్రీమ్‌ను లొట్టలేసుకుంటూ తింటుంటాడు ఆ యువకుడు. కాసేపట్లో ఐస్‌క్రీమ్ అయిపోయినట్లే.. తెల్లారి ఆ యువకుడి పరీక్ష కూడా పోయింది. అయినా ఏలాంటి చీకు చింతా లేని అతగాడు.. రకరకాల ఆహార పదార్థాలు రుచి చూస్తూ రివ్యూలు చెప్పడం మొదలెట్టాడు. కట్‌ చేస్తే ఫుడ్‌ బ్లాగర్‌గా మారి వేలాది మంది ఆహార ప్రియులను ఆకర్షించాడు. తనే దీపక్ బెలేల్. ఫుడ్‌బ్లాగర్ నుంచి ఫుడ్‌ కోర్టు వ్యాపారం వైపు సాగిన తన ప్రయాణమేంటో ఇప్పుడు చూద్దాం.

Deepak Belel is a food blogger
Deepak Belel is a food blogger

By

Published : Oct 26, 2022, 5:42 PM IST

Updated : Oct 26, 2022, 7:55 PM IST

ఫుడ్‌ బ్లాగర్‌ టు ఫుడ్‌ కోర్టు వైపు సాగిన ఓ యువకుడి ప్రస్థానం

Deepak Belel Food Blogger: కాలేజీ కుర్రాళ్లంటే క్లాస్ బంక్ కొట్టి సినిమాకెళ్లడం, షికార్లు తిరగడం సాధారణం. కానీ అలాంటి వారికి ఈ కుర్రాడు భిన్నం. కారణం ఏ రెస్టారెంట్‌లో రుచికరమైన భోజనం దొరుకుతుందా లేక కొత్త రుచులేమైనా వచ్చాయా అని తెలుసుకోడానికే క్లాస్‌లు ఎగొట్టేవాడు. అలా ఆనాడు సరదాగా చేసిన పనులే.. నేడు ఫుడ్‌ బిజినెస్‌లో రాణించడానికి దోహదం చేశాయంటాడు ఈ ఫుడ్‌ బ్లాగర్‌. హైదరాబాద్ నెక్లస్ ​రోడ్డులోని జలవిహార్‌ సమీపంలో దేశీ చినీ పేరుతో ఈ ట్రక్కు ఉంది చూశారా. దీనిని నడుపుతుంది ఈ కుర్రాడే.

పేరు దీపక్ బెలేల్. బెంగాలీ కుటుంబంలో పుట్టిన యువకుడు. హైదరాబాద్‌ సంస్కృతిని ఆకళింపు చేసుకున్నాడు. కాలేజీ రోజుల్లోనే ఫుడ్‌ బ్లాగింగ్‌ నేర్చుకున్న దీపక్.. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఆహార విషయాలు తెలుసుకొని వాటికి రివ్యూలు రాయడం మొదలెట్టాడు. ఫుడ్‌ రివ్యూల రాసే క్రమంలో నగరంలోని చాలా రెస్టారెంట్లకు వెళ్లిన దీపక్‌ అక్కడి ఆహారాన్ని రుచి చూసేవాడు. తన రివ్యూలతో విసుగు చెందిన రెస్టారెంట్‌ వారు మొదట్లో మోహం మీదే తిట్టి పంపించేవారు.

వాటినే విజయ మంత్రాలుగా: మరికొందరు రెస్టారెంట్లలోకి కూడా అడుగుపెట్టనిచ్చేవారు కాదట. ఇలా ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ వాటినే విజయ మంత్రాలుగా మార్చుకున్నట్లు చెబుతాడు దీపక్‌. ఆహారంపై ఆసక్తి, అభిరుచితో ఇంజినీరింగ్ చివరి సంవత్సరం పరీక్షల్లోనూ తప్పాడు దీపక్‌. చివరకు ఎలాగోలా ఇంజినీరింగ్ పూర్తి చేసి ఒకటి రెండు చోట్ల ఉద్యోగాలు చేశాడు. కానీ అవేవి ఇతగాడికి సంతృప్తిని ఇవ్వకపోవడంతో వాటిని వదిలేశాడు. చేతికందొచ్చిన కొడుకు సంపాదిస్తాడనుకున్న తల్లిదండ్రుల ఆశలను నీరుగార్చిన దీపక్‌.

ఫుడ్‌ బ్లాగర్‌గా తనదైన గుర్తింపు:ఏదొక రోజు మంచి పేరు తెచ్చుకుంటానని వారికి చెప్పేవాడు. చివరకి ఆ మాటల్నే నిజం చేశాడు దీపక్‌. ఫుడ్‌ బ్లాగర్‌గా తనదైన గుర్తింపు పొందిన దీపక్‌ సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టాడు. దీంతో దీపక్‌కు సామాజిక మాద్యమాల్లో క్రేజ్ పెరిగింది. దీపక్‌ను అనుసరించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. దీపక్ ఎలాంటి ఫుడ్ గురించి చెబుతాడోనని ఆశగా ఎదురు చూసే ఆహార ప్రియులు అనేక మంది ఉండేవారు.

తనదైన అధ్యయనం: కొన్నాళ్లు ఫుడ్ బ్లాగర్‌గా రాణించిన దీపక్ ఫుడ్​ బిజినెస్‌లోకి అడుగుపెట్టాలనుకున్నాడు. ఈ క్రమంలో తనదైన అధ్యయనం చేసిన యువకుడు కొన్ని లోటుపాట్లను గ్రహించాడు. అందులో ముఖ్యంగా యువత అధికంగా ఇష్టపడే చైనీస్‌ ఫుడ్‌ విక్రయాల్లో నాణ్యత, రుచి లేదని తెలుసుకున్నాడు. దీంతో తాను ఓ మంచి ఆహారాన్ని అందించాలనుకున్నట్లు చెబుతాడు దీపక్‌. వ్యాపారం బాట పట్టాలనుకున్న దీపక్‌ లక్డీకపూల్​లోని శ్రీవెంకటేశ్వర హోటల్​లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు.

దేశీ చినీ పేరుతో ఫుడ్ ట్రక్‌: ఆ తర్వాత జలవిహార్ వద్ద దేశీ చినీ పేరుతో ఫుడ్ ట్రక్‌ను ప్రారంభించాడు. మొదట 10 రకాల వంటకాలను సిద్ధం చేసిన దీపక్.. ఆహారప్రియుల నుంచి వస్తోన్న ఆదరణతో సుమారు 15 రకాల వంటకాలను రుచి చూపిస్తున్నాడు. ఈరోజు ఎలాంటి ఆహారం తిన్నామనే కంటే.. ఆ ఆహార చరిత్ర ఎంటో తెలుసుకోవడంలోనే తనకు సంతోషం ఉందంటోన్న దీపక్. తక్కువ ధరలో ఆహారాన్ని అందించేందుకు ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు.

ఇవీ చదవండి:Calories Count మీరు తినే ఆహారంలో ఎన్ని కెలోరీలు ఉన్నాయో తెలుసుకోండి

'అమృతగాథ' పుస్తకం ఆవిష్కరించిన మోదీ.. ఈనాడుపై ప్రశంసలు

Last Updated : Oct 26, 2022, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details