తెలంగాణ

telangana

ETV Bharat / state

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా చందన దీక్షల విరమణ - సింహాద్రి అప్పన్న దీక్షల విరమణ

ఏపీలోని విశాఖ సింహాద్రి అప్పన్న ఆలయానికి మాల వేసుకున్న భక్తలు తరలివచ్చి.. దీక్ష విరమణ చేశారు. ఇందులో భాగంగా భక్తులు శోభాయాత్ర నిర్వహించి.. శాంతి హోమం చేశారు.

సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా చందన దీక్షల విరమణ
సింహాద్రి అప్పన్న సన్నిధిలో వైభవంగా చందన దీక్షల విరమణ

By

Published : Jan 8, 2021, 3:45 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం సింహాచలం సింహాద్రి అప్పన్న సన్నిధిలో చందన దీక్షల విరమణలు జరిగాయి. 40 రోజులపాటు మాల వేసుకుని స్వామిని ఆరాధించిన భక్తులు... ఇరుముడి సమర్పించి దీక్ష విరమణ చేశారు. అనంతరం అప్పన్నని దర్శనం చేసుకున్నారు. దీక్షల విరమణకు ఈ రోజే ఆఖరి రోజు కావడంతో వివిధ జిల్లాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు.

కొవిడ్ కారణంగా ఈ ఏడాది దీక్షల విరమణ, కొండ దిగువన చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పట్లు చేశారు. దీంతో భక్తులు నిబంధనలు పాటిస్తూ స్వామికి కొండ దిగువున ఇరుముడి సమర్పించారు.

ఇదీ చదవండి:భూమా అఖిలప్రియను కస్టడీకి కోరుతూ పోలీసుల పిటిషన్

ABOUT THE AUTHOR

...view details