తెలంగాణపై చలిపులి పంజా విసురుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం గిన్నెదరిలో రాష్ట్రంలోనే అత్యల్పంగా 9.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ శీతాకాలంలో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే. వారం రోజుల వ్యవధిలో 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత తగ్గింది.
రాష్ట్రంపై పంజా విసురుతున్న చలిపులి - Telangana weather report
రాష్ట్రంపై చలి పంజా విసురుతోంది. అత్యల్ప ఉష్టోగ్రతలు నమోదవుతూ వణికిస్తోంది. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల ప్రజలు గజగజ వణుకుతున్నారు. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనావేస్తున్నారు.
ఈశాన్య భారతం నుంచి చలిగాలులు వీస్తుండడం వల్ల రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పగలు, రాత్రి మధ్య ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంటోంది. ఆదిలాబాద్ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ చలి తీవ్రత ముందుగానే ప్రారంభమవుతుంది. హైదరాబాద్‌లో సైతం జన సమ్మర్థ ప్రాంతాలను బట్టి ఉష్ణోగ్రతల్లో తేడాలుంటున్నాయి. ఇంకా మున్ముందు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.
ఇదీ చదవండి:'కేంద్ర నిధులు కేటాయిస్తున్నా అసత్యాలు చెబుతున్నారు'