corona vaccination: గతేడాది దేశవ్యాప్తంగా కొవిడ్ మహమ్మారి వెలుగు చూసిన తర్వాత వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేసే ముందులపట్ల ఎంతో ఆసక్తి పెరిగింది. పరిశోధనల ఫలితంగా కేవలం 8 నెలల వ్యవధిలోనే భారత్‌లో కొవిడ్ టీకాలు అందుబాటులోకి వచ్చింది. తొలినాళ్లలో టీకా పట్ల ఉన్న అపోహల నేపథ్యంలో వ్యాక్సినేషన్‌కు ఆదరణ తక్కువగా వచ్చినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికల ఫలితంగా వ్యాక్సినేషన్‌కు ఆదరణ పెరిగింది. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన దాదాపు 2.7 కోట్ల మంది కొవిడ్ అర్హత కలిగి ఉండగా అందులో... ఇప్పటికే 2.6 కోట్ల మందికి పైగా ఒక డోస్ టీకా పూర్తి చేసుకున్నారు. అందులో ఆరోగ్య సిబ్బంది 30,07,893 మంది కాగా... ఫ్రంట్ లైన్ వర్కర్లు 31,09,162 మంది ఉన్నారు. 18 నుంచి 44 మధ్య వయస్కుల్లో 1,56,32,689 మంది టీకా తీసుకున్నారు. ఇక 45 ఏళ్లు పై బడిన వారు 99 లక్షల 52 వేల 55 మంది ఉన్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో నాలుగు కోట్ల టీకా డోసుల పంపిణీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ... నెలాఖరు నాటికి వందశాతం మందికి టీకా పంపిణీ పూర్తి చేయాలని ముందుకు సాగుతోంది.
ఆసక్తి చూపని ప్రజలు...
covid vaccination: తొలి డోస్ వ్యాక్సినేషన్‌కు వచ్చిన స్పందన మాత్రం రెండో డోస్‌కు కొరవడింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు కేవలం కోటీ 40 లక్షల 67 వేల 216 మంది మాత్రమే రెండో డోస్ టీకా తీసుకున్నారు. అంటే మరో కోటీ 21 లక్షల 44 వేల 583 మంది రెండో డోస్ టీకా తీసుకోవాల్సి ఉంది. అయితే వీరిలో ఏకంగా సుమారు 79 లక్షల మంది డిసెంబర్ చివరి నాటికి... రెండో డోస్ తీసుకోవాల్సిన గడువు ముగుస్తున్నా ఇప్పటికీ రెండో డోస్ పట్ల లక్షల మంది ఆసక్తి చూపటం లేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
టీకాలు అందుబాటులో ఉన్నా..