ఎడతెరిపించిన వానలతో మూసీ నదికి వరద కొద్దిగా తగ్గడంతో అంబర్ పేటలోని మూసారాంబాగ్ వంతెనపై వరద ప్రవాహం తగ్గింది. వంతెన తేలడంతో అధికారులు సహాయక చర్యలను వేగవంతం చేశారు.
మూసీనదికి తగ్గిన వరద.. సహాయక చర్యలు వేగవంతం - హైదరాబాద్ తాజా వార్తలు
రెండు రోజుల క్రితం భాగ్యనగరంలో కురిసిన భారీ వర్షంతో వరద తాకిడికి గురైన మూసీనది ప్రవాహం మెల్లగా తగ్గుతోంది. వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు.
![మూసీనదికి తగ్గిన వరద.. సహాయక చర్యలు వేగవంతం decreased flow to musi river musarambagh hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9186293-51-9186293-1602764916471.jpg)
మూసీనదికి తగ్గిన వరద.. సహాయక చర్యలు వేగవంతం
సహాయక చర్యలను స్థానిక ఎమ్మెల్యే కాలె వెంకటేష్‌తో కలిసి మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. చర్యలను వేగవంతం చేసి రాకపోకలకు ఇబ్బంది రాకుండా త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు.
ఇదీ చదవండి:వ్యాపార సముదాయాలను నిండాముంచిన భారీ వర్షం