దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహబూబ్‌గనర్ జిల్లా కేంద్రంలోని కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు మహాలక్ష్మిదేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య సంఘం సభ్యులు అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. కరెన్సీ విలువ అక్షరాలా రూ.4 కోట్ల 44 లక్షల 44 వేల 444 రూపాయల 44 పైసలు ఉంటుందని తెలిపారు.
goddess with Currency notes: ఆ అమ్మవారిని ఎన్నికోట్ల రూపాయలతో అలంకరించారో తెలుసా? - ఐదోరోజు శరన్నవరాత్రి ఉత్సవాలు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కన్యకా పరమేశ్వరి దేవీ అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించారు. మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలోని అమ్మవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
మహాలక్ష్మిదేవి రూపంలో భక్తులకు దర్శనం
భారతీయ కరెన్సీ నోట్లను కాగితపు పువ్వులలాగా, తోరణాలుగా తయారు చేసి వాటిని గర్భగుడితో పాటు ఆలయంలో అలంకరించారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఐదో రోజు అమ్మవారు మహాలక్ష్మీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయం వెలుపల భక్తులు బారులు తీరారు. దీంతో పాటు ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు, హోమాలు నిర్వహించారు.
ఇదీ చూడండి:Bathukamma day 6: ఆరోరోజు 'అర్రెం'.. బతుకమ్మ ఎందుకు ఆడరో తెలుసా?