తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: ఏలూరులో తగ్గుముఖం పట్టిన వింతవ్యాధి బాధితుల సంఖ్య - elusive disease in eluru news

ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధితో అస్వస్థతకు గురైన వారి సంఖ్య తగ్గుముఖం పట్టింది. గడిచిన 24గంటల్లో ఇద్దరు మాత్రమే ఆస్పత్రిలో చేరారు. మరో ఏడుగురు చికిత్స పొందుతున్నారు.

eluru
ఏపీ: ఏలూరులో తగ్గుముఖం పట్టిన వింతవ్యాధి బాధితుల సంఖ్య

By

Published : Dec 13, 2020, 1:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. 24గంటల్లో ఇద్దరు మాత్రమే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరగా... వారు కూడా కోలుకున్నారు. వారం రోజుల వ్యవధిలో వింత వ్యాధి కేసుల సంఖ్య 612కు చేరుకొంది. ఇందులో 605మంది కోలుకున్నారు. ఏలూరులో ఇద్దరు, విజయవాడలో ఐదుగురు చికిత్స పొందుతున్నారు. వైద్యాధికారులు అన్ని ప్రాంతాల్లో వైద్యశిబిరాలను కొనసాగిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details