EAMCET Exam 2022: భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ఎంసెట్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నందున రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈనెల 18 నుంచి 20 వరకు జరగాల్సిన ఇంజినీరింగ్ ఎంసెట్ యథాతథంగా ఉంటుందని అధికారులు వెల్లడించారు.
ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా.. ఇంజినీరింగ్ యథాతథం - EAMCET Exam 2022 postponed due to rain
EAMCET Exam 2022: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తెలంగాణ ఎంసెట్ పరీక్ష నిర్వహణపై నెలకొన్న సందిగ్ధతపై ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికీ వర్షాలు కురుస్తున్నందున రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఎంసెట్
గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నందున ఎంసెట్ నిర్వహణపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఎంసెట్ ఈనెల 14వ తేదీ నుంచి మొదలవుతుందా? లేదా? అన్న దానిపై సందిగ్ధం నెలకొంది. ఈనెల 14, 15 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అధికారులు పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వంతో సంప్రదించి అగ్రికల్చర్ పరీక్ష వాయిదా వేసి.. ఇంజినీరింగ్ పరీక్షను యథాతథంగా జరపాలని నిర్ణయించారు.
Last Updated : Jul 13, 2022, 12:34 PM IST