తెలంగాణ

telangana

ETV Bharat / state

సికింద్రాబాద్ దక్కన్‌ మాల్‌ కూల్చివేత ప్రారంభం - సికింద్రాబాద్‌ దక్కన్‌ మాల్‌ కూల్చివేత

Secunderabad Deccan Mall Demolition : సికింద్రాబాద్ మినిష్టర్ రోడ్​లో అగ్నిప్రమాదనికి గురైన దక్కన్ మాల్ ను కూల్చివేయాలని జీహెచ్​ఎంసీ నిర్ణయించింది. రాత్రి నుంచి దక్కన్ మాల్ భవనాన్ని కూల్చివేయడం ప్రారంభించారు. ఈనెల 19న దక్కన్ మాల్​లోని సెల్లార్​లో మంటలు చెలరేగాయి. సుమారు 12 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

deccan mall
దక్కన్‌ మాల్‌

By

Published : Jan 27, 2023, 8:11 AM IST

Secunderabad Deccan Mall Demolition: సికింద్రాబాద్​లోని మినిస్టర్‌ రోడ్డులో అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్‌ భవనం కూల్చివేత ప్రక్రియను అధికారులు ప్రారంభించారు. భారీ హైడ్రాలిక్‌ యంత్రం సహాయంతో భవనం కూల్చివేత పనులను మాలిక్‌ సంస్థ చేపట్టింది. ఈ భవనం కూల్చివేత పనులను మాలిక్‌ సంస్థ దక్కించుకుంది. భవనం కూల్చివేత ప్రారంభం కావడంతో పరిసర ప్రాంతాల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

వారం రోజుల్లో భవనం పూర్తిగా కూల్చివేత చేసేలా అధికారులు ప్రణాళికలు రచించారు. రెండు రోజుల క్రితం అగ్నికి ఆహూతైన భవనాన్ని కూల్చివేసేందుకు ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించారు. మాలిక్ డిమాలేషన్ సంస్థ భవన కూల్చివేత టెండర్లను దక్కించుకుంది. అత్యంత ఆధునిక యంత్రాలతో దక్కన్ మాల్​ను కూల్చివేస్తున్నామంటున్న మాలిక్ డిమాలేషన్ ప్రతినిధి రహమాన్ ఫారూఖీ పేర్కొన్నారు.

మంత్రి తలసాని హామీ: దక్కన్ మాల్ కూల్చివేత సమయంలో పక్క భవనాలు దెబ్బతింటే, తగిన నష్టపరిహారం అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల సాయం అందించామని.. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తలసాని వెల్లడించారు. అగ్నిమాపక పరికరాలు కొనుగోలు చేసేలా.. సెల్లార్, గోదాముల వినియోగంపై చైతన్యం కలిగిస్తామన్నారు. చిన్న అగ్నిమాపక వాహనాలు కొనుగోలు చేసే ఆలోచన ఉందన్నారు.

భవనం కూల్చడానికే మొగ్గు చూపిన అధికారులు:అగ్ని ప్రమాదం జరిగిన తరవాత మంటల్లో ఉన్న భవనంలోని శ్లాబులు ఒక్కొక్కటిగా పెచ్చులూడుతూ వచ్చాయి. 1,2,3 అంతస్తుల్లో అయితే శ్లాబులు కూలి సెల్లార్లులో పడ్డాయి. మంటలు ఎక్కువగా రావడమే స్టాల్‌ పూర్తిగా బలహీనపడి కూలిపోయినట్లు అధికారులు భావించారు. భవనం క్రమంగా బలహీనపడి కుప్పకూలే ప్రమాదం ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు.. కూల్చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో చుట్టు పక్కల ఇళ్లను ఖాళీ చేయించి.. వారు లోపలికి వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఇంతలోగా ప్రభుత్వం భవనాన్ని కూల్చడానికి టెండర్లను పిలిచింది. మార్టు కూల్చివేత రాత్రి నుంచి సాగుతోంది.

కొన్ని అంతస్తుల్లో ధ్వంసం కాని సామాగ్రి: భవనంలో ఆరు అంతస్తులుండగా కేవలం నాలుగు అంతస్తులు మాత్రమే పూర్తిగా కాలిపోయాయి. మిగతా రెండు అంతస్తుల్లోని వస్తువులు ఏమాత్రం కాలిపోకుండా ఉండటం చూసి అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మైనస్- 2 సెల్లార్లో ఉన్న గోదాం, దక్కన్ సామగ్రి కూడా కాలిపోకుండా అలాగే ఉన్నాయి. సెల్లార్, మొదటి, రెండవ, మూడవ అంతస్తుల్లో మాత్రమే సామాగ్రి మొత్తం కాలిపోయింది. అందుకే ఈ ఫ్లోర్లలో ఉండే శ్లాబులు కూలిపోయాయి. 4, 5, 6 అంతస్తుల్లో భవనంలోకి కేవలం పొగ మాత్రమే చేరటంతో వస్తువులు కొద్దిగా దెబ్బతిన్నాయి. అందులో ఉండే కొంత సామగ్రి చెక్కుచెదరకుండా ఉన్నట్టు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details