NABARD Promoting Handloom And Artisans In Hyderabad :చేనేత, హస్తకళలను ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్‌లో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కళాకారుల్లోని నైపుణ్యం మెరుగు పర్చడంతోపాటు, మార్కెటింగ్ సహావివిధ అంశాల్లో రాణించేందుకు రాణించేందుకు నాబార్డు సహకారం అందిస్తోంది. అందులోభాగంగా అమీర్‌పేట్‌లో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో గృహాలంకరణ వస్తువులు, పెయింటింగ్ చేసిన వస్త్రాలతో పాటు కలంకారి చీరలు, మంగళగిరి, వెంకటగిరి, పైథానీ, కోసా సిల్క్ చీరలు కనువిందు చేస్తున్నాయి. బస్తర్ సిల్క్ ఉత్పత్తులు, మ్యాట్‌లు, తేనె ఉత్పత్తులు, బిద్రీకళలు, చెక్కతో చేసిన దేవుని బొమ్మలు, మిల్లెట్ వంటి ఉత్పత్తులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
"ఈ సంవత్సరం నాబార్డ్ ద్వారా ఇలాంటి ఎగ్జిబిషన్ దేశ మొత్తంలో ప్రదర్శన జరుగుతోంది. తెలంగాణలో 2014 నుంచి డెక్కన్ హాట్ పేరుతో ప్రదర్శన అవుతుంది. ప్రతి సంవత్సరం ఈ ప్రదర్శన ఇంతకింతకు పెరుగుతూ వస్తోంది. 20 రాష్ట్రాల నుంచి హస్తకళాకారులు పాల్గ1ని స్టాల్స్ ఏర్పాటు చేసేలా పోత్సహించాం. రకరకాల ప్రాంతాలకు వెళ్లినప్పుడు వివిధ రకాల అభిరుచులు ఎలా ఉంటాయో తెలుస్తుంది. కొనుగోలు ధరలో తగ్గింపు ఉంటుంది." - సుశీల గోవిందరాజులు చింతల, సీజీఎం, నాబార్డ్
Deccan Hot Exhibition in Hyderabad :అమీర్‌పేట్‌లోని ఆ ప్రదర్శనకు సందర్శకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. 2014 నుంచి ఏటా డెక్కన్ హాట్ పేరిట నిర్వహిస్తున్న ఆ ఎగ్జిబిషన్‌కి వివిధ రాష్ట్రాలకు చెందిన హస్తకళాకారులు హాజరై వారు తయారుచేసిన వస్తువులను విక్రయిస్తున్నారు. హస్తకళాకారులకు మార్కెటింగ్ అవకాశాలపై సహకారం అందిస్తున్నట్లు నాబార్డ్ అధికారులు తెలిపారు.