తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.రెండు లక్షల కోట్ల అప్పు - telangana state budget

రాష్ట్ర అప్పుల పరిమాణం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.2.29 లక్షల కోట్ల మార్కును దాటనుంది. ఇందులో బహిరంగ రుణాలు రూ.1,89,000 కోట్ల పైచిలుకు ఉండగా.. మిగతావి ఇతర అప్పులు. జీఎస్డీపీలో అప్పుల శాతం 20.74శాతం మాత్రమేనని.. ఇది కేంద్రం విధించిన పరిమితుల్లోనే ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. వీటికి అదనంగా మరో రూ.90 వేల కోట్ల రూపాయల వరకు వివిధ సంస్థల రుణాలకు ప్రభుత్వం గ్యారంటీలు ఇచ్చింది.

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. రెండు లక్షల కోట్ల అప్పు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. రెండు లక్షల కోట్ల అప్పు

By

Published : Mar 8, 2020, 7:12 PM IST

Updated : Mar 8, 2020, 8:50 PM IST

వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1,82,914 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో భారీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అందులో రూ.35,500 కోట్లు రుణాల ద్వారా సమీకరించుకోవాలని ప్రతిపాదించింది. అందులో బహిరంగ మార్కెట్ రుణాలు రూ.34,000 కోట్లు. కేంద్రం నుంచి రూ.400 కోట్లు, ఫ్లోటింగ్ అప్పు రూ.100 కోట్లతో పాటు ఇతర రుణాలు మరో రూ.వెయ్యి కోట్లు ఉన్నాయి.

వడ్డీ చెల్లింపుల కోసం..

వడ్డీ చెల్లింపుల కోసం బడ్జెట్‌లో రూ.14,625 కోట్లు కేటాయించారు. బడ్జెట్ నేపథ్యంలో రాష్ట్ర అప్పుల స్థితిగతులను కూడా రాష్ట్ర ప్రభుత్వం వివరించింది.

ఆర్థిక సంవత్సరం అప్పులు (కోట్లలో) జీఎస్డీపీ శాతం
2017-18 రూ.1,52,190కోట్లు 20.21
2018-19 రూ.1,75,281 కోట్లు 20.25

అప్పుల విషయంలో ఆందోళన వద్దు

2019-20 ఆర్థిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పులు రూ.1,99,215కోట్లు. ఇది జీఎస్డీపీలో 20.55శాతం. 2020-21 బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పుల విలువ రూ.2,29,205 కోట్లు. ఇది జీఎస్డీపీలో 20.74శాతం.

అప్పుల వివరాలు వాటి విలువ (కోట్లలో)
బహిరంగ రుణాలు రూ.1,87,606
కేంద్ర ప్రభుత్వ అప్పులు రూ.8,682
స్వతంత్ర సంస్థల రుణాలు రూ.13,961
పొదుపు పథకాల అప్పులు రూ.18,954

అయితే అప్పుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరిమితులకు లోబడే రాష్ట్ర అప్పులున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తుచేసింది.

గ్యారంటీల మొత్తం..

ప్రభుత్వ అప్పులకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీల మొత్తం ఈ ఏడాది మార్చి ఒకటో తేదీ వరకు రూ.89,600 కోట్లు.

వివిధ సంస్థలు, కార్పొరేషన్లకు ఇచ్చిన గ్యారెంటీలు (రుణం) వాటి విలువ (కోట్లలో)
మిషన్ భగీరథ కార్పొరేషన్ రూ.24,021 కోట్లు
కాళేశ్వరం కార్పొరేషన్ రూ.35,086 కోట్లు
జలవనరుల అభివృద్ధి సంస్థ రూ.9,675కోట్లు
గృహనిర్మాణ సంస్థ రూ.5,845 కోట్లు
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.3,151కోట్లు
గొర్రెల అభివృద్ధి సంస్థ రుణం రూ.2,826కోట్లు

రిస్క్ ఔట్ స్టాండింగ్..

మొత్తం గ్యారంటీల్లో రిస్క్ ఔట్ స్టాండింగ్ గ్యారంటీల అంచనా రూ.40,241కోట్లు.

రిస్క్ ఔట్ స్టాండింగ్ వాటి విలువ (కోట్లలో)
నీటిపారుదల రిస్క్ ఔట్ స్టాండింగ్‌ రూ.22,380
మిషన్ భగీరథ రూ.12,010
ఇతర రిస్క్ ఔట్ స్టాండింగ్ గ్యారంటీలు రూ.5,849

ఇవీ చూడండి:తెలంగాణ బడ్జెట్ కేటాయింపులు ఇవే..

Last Updated : Mar 8, 2020, 8:50 PM IST

ABOUT THE AUTHOR

...view details