తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుల అప్పుల చెల్లింపులపై రుణ ఉపశమన కమిషన్​ చర్చ - telangana varthalu

రైతులు, రైతు కూలీల ప్రైవేటు, బ్యాంకు అప్పులను రుణ విమోచన చట్టం తీసుకొచ్చి చెల్లించాలనే అంశంపై తెలంగాణ రైతు రుణ ఉపశమన కమిషన్‌ సభ్యులు విస్తృతంగా చర్చించారు. అప్పులను చెల్లించాలని వస్తున్న దరఖాస్తులపై విచారణ జరిపి నిర్ణయం తీసుకుంటామని కమిషన్​ ఛైర్మన్​ స్పష్టం చేశారు.

రైతుల అప్పుల చెల్లింపులపై రుణ ఉపశమన కమిషన్​ చర్చ
రైతుల అప్పుల చెల్లింపులపై రుణ ఉపశమన కమిషన్​ చర్చ

By

Published : Feb 16, 2021, 7:40 PM IST

రాష్ట్రంలో రైతులు, రైతు కూలీలకు ఉన్న ప్రైవేటు, బ్యాంకు అప్పులు చెల్లించాలని వస్తున్న విజ్ఞప్తులను పరిశీలిస్తున్నామని తెలంగాణ రైతు రుణ ఉపశమన కమిషన్‌ ఛైర్మన్ నాసర్ల వెంకటేశ్వర్లు అన్నారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర రైతు రుణ కమిషన్ కార్యాలయంలో ఛైర్మన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిషన్ సభ్యులు పాకాల శ్రీహరి, కె.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

రైతులు, రైతు కూలీల ప్రైవేటు, బ్యాంకు అప్పులను రుణ విమోచన చట్టం తీసుకొచ్చి చెల్లించాలనే అంశంపై కమిషన్​ ఆధ్వర్యంలో విస్తృతంగా చర్చించారు. తమకు ఉపశమనం కల్పించాలని వచ్చిన దరఖాస్తులపై విచారణ జరిపి రుణ పరిష్కారాలపై నిర్ణయం తీసుకుంటామని వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించిన మంత్రి ఎర్రబెల్లి

ABOUT THE AUTHOR

...view details