బడ్జెట్‌పై ఇవాళ సంక్షేమ పద్దులపై చర్చిస్తారు. గృహనిర్మాణం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా-శిశు సంక్షేమ శాఖలపై చర్చ ఉంటుంది. ప్రశ్నోత్తరాల్లో విదేశీవిద్యానిధి పథకం, విద్యార్థులకు సన్నబియ్యం, టీ హబ్ రెండో దశ, జీహెచ్ఎంసీ పరిధిలో ఆహారభద్రతా పర్యవేక్షణ, గుడుంబా నిర్మూలన, గనుల తవ్వకంపై రాబడి పెరుగుదల, పౌరసరఫరాల్లో సంస్కరణలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి. ప్రజాపద్దుల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సమితి, అంచనాల కమిటీ సభ్యుల కోసం నేడు నామినేషన్లు స్వీకరిస్తారు. మూడు కమిటీలకు శాసనసభ నుంచి తొమ్మిది, మండలి నుంచి నలుగురు సభ్యులను ఎన్నుకుంటారు.
నేడు శాసనసభలో పద్దుపై చర్చ - assembely
రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇవాళ పద్దులపై చర్చ ప్రారంభం కానుంది. బడ్జెట్‌పై ఉభయసభల్లో సాధారణ చర్చ పూర్తైనందున పద్దులపై అసెంబ్లీలో చర్చించనున్నారు.
నేడు శాసనసభలో పద్దులపై చర్చ