బడ్జెట్‌పై ఇవాళ్టి నుంచి చర్చ ప్రారంభం కానుంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. రెండు లక్షలా 30 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ బడ్జెట్‌ను ఈనెల 18న ప్రవేశపెట్టింది. మరుసటి రోజు సెలవు తర్వాత ఇవాళ తిరిగి ఉభయసభలు సమావేశం కానున్నాయి.
నేటి నుంచి శాసనసభ, శాసనమండలిలో ప్రశ్నోత్తరాలతోపాటు శూన్యగంట కూడా ఉంటుంది. అనంతరం రెండు సభల్లోనూ బడ్జెట్‌పై సాధారణ చర్చ చేపడతారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో విదేశీ ఉపకారవేతనాలు, ఎలక్ట్రానిక్ తయారీ రంగానికి ప్రోత్సాహం, మైనార్టీలకు బ్యాంకు రుణాలు, టీఎస్ బీపాస్ విధానం, రేషన్ కార్డుల అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.