తెలంగాణ

telangana

ETV Bharat / state

దివ్యాంగులు అర్ధాకలితో బతుకుతున్నారు: డెఫ్ సంస్థ

హైదరాబాద్​ పరిధిలోని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ సంస్థ డిమాండ్ చేసింది. పెండింగ్​లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని ఆ సంస్థ ప్రధాన కార్యదర్శి కోరారు. నాంపల్లిలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకి దిగారు.

deaf-people-demand-to-fill-backlog-posts-of-ph-candidates-at-nampally-in-hyderabad
deaf-people-demand-to-fill-backlog-posts-of-ph-candidates-at-nampally-in-hyderabad

By

Published : Dec 21, 2020, 2:06 PM IST

పెండింగ్​లో ఉన్న దివ్యాంగుల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని డెవలప్​మెంట్ సొసైటీ ఫర్ ది డెఫ్ సంస్థ డిమాండ్ చేసింది. హైదరాబాద్ నాంపల్లిలోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జంటనగరాల పరిధిలో రెండు లక్షలకుపైగా దివ్యాంగులు ఉన్నారని... వీరికి ఉపాధి, ఉద్యోగాలు లేక అర్ధాకలితో బతుకుతున్నారని డెఫ్ సంస్థ ప్రధాన కార్యదర్శి భారతి ఆవేదన వ్యక్తం చేశారు.

దివ్యాంగులు వారి కుటుంబాన్ని పోషించలేక చాలా అవస్థలు పడుతున్నారని... పింఛన్లు సరిపోక దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. రెండు పడక గదుల ఇళ్లను దివ్యాంగులకు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి... జీహెచ్ఎంసీ పరిధిలోని దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి: జీవితాంతం గుర్తుండేలా ప్లాస్టిక్​ ప్రమేయం లేని పర్యావరణ పెళ్లి

ABOUT THE AUTHOR

...view details