తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి... 10 మందికి గాయాలు - road accident at medchal

మేడ్చల్ జాతీయ రహదారిపై ఈరోజు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి.

Deadly road accident on National Highway at medchal district
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

By

Published : Feb 16, 2020, 11:40 AM IST

మేడ్చల్ జిల్లా డబీర్​పూర ప్రధాన రహదారిపై ఇండియన్ అయిల్​ పెట్రోల్ పంపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్ నుంచి నగరానికి వస్తున్న ఫిగో కారును, నిజామాబాద్ వైపు వెళ్తున్న జైలో కారు డివైడర్​ను దాటి అటు వైపు వస్తున్న కారును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరి మృతి చెందగా, పది మందికి గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు. మృతుడు హైదరాబాద్ అంబర్​పేటకు చెందిన సామల కార్తీకేయగా గుర్తించారు.

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి :తెలంగాణలో 91,295 ఎకరాల అడవి దగ్ధం

ABOUT THE AUTHOR

...view details