తెలంగాణ

telangana

ETV Bharat / state

చచ్చినా సమస్యే: రెండురోజులుగా అంత్యక్రియలకు నిరీక్షణ - తిమ్మరాజుపురంలో శవం అంతక్రియల వార్తలు

ఎంత బతికినా చివరకు చేరేది అరడుగుల నేలలోకే.. సొంత భూములు ఉన్నవారు తమ స్థలాల్లోనే అయినవాళ్లకు అంత్యక్రియలు చేస్తారు. భూములు లేనివాళ్లు శ్మశానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ ఊళ్లో శ్మశానం లేకపోతే ?

ఖననానికి లేని చోటు.. రెండు రోజులుగా అంత్యక్రియలకు నిరీక్షణ

By

Published : Nov 20, 2019, 3:16 PM IST

చిత్తూరు జిల్లా వి. కోట మండలం తిమ్మరాజుపురం గ్రామంలో శ్మశానం లేక ఓ శవం రెండు రోజులనుంచి అంత్యక్రియలకు నోచుకోలేదు. ఎనభై ఏళ్ల వృద్ధురాలు వెంకటమ్మ మృతి చెంది రెండు రోజులవుతున్నా... ఆమెను పూడ్చేందుకు స్థలం లేకపోవడంతో బంధువులు భూమి కోసం పోరాడుతున్నారు. వాగుపక్కనే ఉన్న స్థలాన్ని ఇటీవల శ్మశానానికి అధికారులు కేటాయించారు. అయితే ఆ భూమిని సాగు చేసుకుంటున్న దళితులు దానిని ఇచ్చేది లేదంటూ భీష్మించి కూర్చోవడంతో సమస్య తీవ్రతరమైంది.

విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సర్వే చేసి ఆ భూమి శ్మశానమని తేల్చినా... ఇవ్వబోమంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగడంతో తిమ్మరాజపురం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇన్నేళ్లనుంచి ఎవరైనా మృతి చెందితే వారి పొలాల్లోనే ఖననం చేసుకునేవారు. తాజాగా మృతి చెందిన వెంకటమ్మకు సొంత భూమి లేకపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. భూమిలేని పేదలను ఎక్కడ పాతి పెట్టాలంటూ గ్రామంలో ఓ వర్గం పట్టుబడటంతో శ్మశాన స్థలం కోసం ఆందోళనకు దిగారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు గ్రామానికి చేరుకొని సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఖననానికి లేని చోటు.. రెండు రోజులుగా అంత్యక్రియలకు నిరీక్షణ

ఇదీచూడండి.చంద్రగిరిలో ఇరువర్గాల ఘర్షణ... యువకునిపై కత్తితో దాడి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details