తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓయూ మైదానంలో కలకలం రేపిన మృతదేహం... - DEAD BODY FOUND IN OU CAMPUS GROUND

ఓయూ మైదానంలో క్రికెట్​ ఆడుకుంటున్న విద్యార్థులకు ఓ వ్యక్తి పడిపోయి కన్పించాడు. పక్కనే ఉన్న మందుసీసా, కూల్​డ్రింక్​ను చూసి ఫుల్లుగా తాగి పడిపోయాడేమో అనుకున్నారు. ఎందుకైనా మంచిదని అటుగా వెళ్తున్న పోలీసులకు చెప్పారు. తీరా వచ్చి చూస్తే... అతను చనిపోయాడు. అసలు ఎందుకు చనిపోయాడు...? ఏం జరిగింది...?

DEAD BODY FOUND IN OU CAMPUS GROUND

By

Published : Oct 15, 2019, 9:42 PM IST

Updated : Oct 16, 2019, 5:04 AM IST

ఉస్మానియా యూనివర్సిటీ మైదానంలో ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మందు తాగి పడిపోయాడనుకున్న విద్యార్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకుని చూసిన పోలీసులు... ఆ వ్యక్తి మరణించినట్లు నిర్ధరించారు. మృతదేహం వద్ద దొరికిన ఆధార్​కార్డు ఆధారంగా మృతుడు రాంనగర్ నివాసి నేరెళ్ల రమేశ్​ గౌడ్​గా గుర్తించారు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రాంనగర్ బయోలాజికల్ లిమిటెడ్ కంపెనీలో ఫిల్లింగ్ ఆపరేటర్​గా పనిచేస్తున్నాడు. ఈనెల 13న ఇంటి నుంచి విధులకు వెళ్లిన రమేశ్​ ఈరోజు ఓయూ మైదానంలో విగతజీవిగా కన్పించాడు. మృతదేహం వద్ద దొరికిన మందుసీసా, కూల్​డ్రింక్, పాయిజన్​ బాటిల్​​ను చూశాక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. భార్యను ఫోన్​లో సంప్రదించగా... రెండురోజులుగా కన్పించటంలేదని ముషీరాబాద్ పోలీస్​స్టేషన్​లో కేసు పెట్టినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఓయూ మైదానంలో కలకలం రేపిన మృతదేహం...
Last Updated : Oct 16, 2019, 5:04 AM IST

ABOUT THE AUTHOR

...view details