తెలంగాణ

telangana

By

Published : Feb 4, 2020, 8:48 PM IST

Updated : Feb 4, 2020, 11:43 PM IST

ETV Bharat / state

చేపల వ్యాపారిని హత్య చేసి మూటకట్టిన నిందితులు

dead-body-found-in-jubilee-hills
dead-body-found-in-jubilee-hills

20:45 February 04

చేపల వ్యాపారిని హత్య చేసి మూటకట్టిన నిందితులు

చేపల వ్యాపారిని హత్య చేసి మూటకట్టిన నిందితులు

 జూబ్లీహిల్స్​లోని జవహార్ నగర్​లో ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... హత్యకు గురైన వ్యక్తి చేపల వ్యాపారి రమేశ్​గా గుర్తించారు.  ఈ నెల 1న రమేశ్​ను గుర్తు తెలియని వ్యక్తులు అపరించారు. ఈ మేరకు కుటుంబసభ్యులు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.  

రూ.కోటి డిమాండ్

బోరబండలోని రామారావు నగర్​లో నివాసం ఉండే రమేశ్​ను ఈఎస్ఐ ఆస్పత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు బలవంతంగా కారులో ఎక్కించుకుపోయినట్లు ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కిడ్నాపర్లు కోటి రూపాయుల ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు... బృందాలుగా ఏర్పడి రమేశ్ ఆచూకి కోసం రెండు రోజులుగా వెతుకుతున్నారు.  

ఫోన్​ నంబర్లను విశ్లేషిస్తున్న పోలీసులు

రమేశ్ మృతితో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. రమేశ్​ను అపహరించిన నిందితులు... మరుసటి రోజే అతన్ని హత్య చేసి గోనె సంచిలో చుట్టి గదిలో పడేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్య ఎవరు చేశారనే కోణంలో వివరాలు సేకరిస్తున్నారు. కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన వ్యక్తులు... ఫోన్ ఎక్కడి నుంచి చేశారనే వివరాలు తెలుసుకుంటున్నారు.  

తెలిసిన వ్యక్తులేనా..!

రమేశ్ ఇటీవల తనకున్న ఆస్తులను విక్రయించి స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. చేపల వ్యాపారంలో రమేశ్ బాగా సంపాదించినట్లు తెలుసుకున్న వ్యక్తులే అతన్ని అపహరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చూడండి:ఫొటోలు ఎందుకు... లాభాలు కావాలి: సీఎం కేసీఆర్

Last Updated : Feb 4, 2020, 11:43 PM IST

ABOUT THE AUTHOR

...view details