తెలంగాణ

telangana

ETV Bharat / state

'వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - లాక్ డౌన్ పై డీసీపీ విశ్వప్రసాద్ స్పందన

హైదరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని చెకింగ్ పాయింట్లను మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ తనిఖీ చేశారు. ప్రజల్లో లాక్​డౌన్ పట్ల పూర్తి అవగాహన పెరిగిందని ఆయన తెలిపారు.

police
police

By

Published : May 27, 2021, 5:37 PM IST

లాక్ డౌన్​ను ప్రజలు గౌరవిస్తున్నారని… ఉల్లంఘనలు చాలా వరకు తగ్గుతున్నాయని మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్ అన్నారు. గాంధీనగర్, ముషీరాబాద్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని చెకింగ్ పాయింట్లను పరిశీలించారు. లాక్ డౌన్ సమయం ముగిసిన తర్వాత రోడ్లపై ఇబ్బడి ముబ్బడిగా వచ్చే వాహనాలను అదుపు చేయాలని డీసీపీ సూచించారు.

ప్రజల్లో లాక్​డౌన్ పట్ల పూర్తి అవగాహన పెరిగిందని డీసీపీ అన్నారు. వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. చిక్కడపల్లి డివిజన్​లో ప్రతిరోజూ 400 వరకు కేసు నమోదు చేసినట్లు వివరించారు.

ABOUT THE AUTHOR

...view details