జిల్లా అధ్యక్షులపై కుంతియా ఆగ్రహం - gandhibhawan
నూతన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్ణయించిన సమయానికి హాజరు కాలేదని ఆగ్రహించారు. గైర్హాజరైన వారిని వివరణ కోరాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించారు.
సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి అధిష్ఠానం ఇటీవల కొత్త డీసీసీలను ఏర్పాటు చేసింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ జిల్లా, నగర అధ్యక్షులను ప్రకటించారు. నూతన అధ్యక్షులతో సోమవారం ఉదయం 11 గంటలకు గాంధీ భవన్లో సమావేశం ఏర్పాటు చేశారు. నలుగురు మాత్రమే హాజరు కావడంతో 12.30కు సమావేశం ప్రారంభమైంది. నిర్దేశించిన సమయానికి రాలేదని కుంతియా అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకసభ ఎన్నికలు పూర్తయ్యే వరకు డీసీసీలు పూర్తి స్థాయిలో పని చేయాలని... ఎవరూ తేలికగా తీసుకోవద్దని స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులను రానున్న లోకసభ ఎన్నికలకు సమాయత్తం చేయాలని సూచించారు.