తెలంగాణ

telangana

ETV Bharat / state

AP CM Jagan Cases: జగన్ అక్రమాస్తుల పెండింగ్ కేసులపై రోజు వారీ విచారణ: హైకోర్టు

జగన్ అక్రమాస్తుల పెండింగ్ కేసులపై రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించింది. 2012 నుంచి దాఖలైన సుమారు 40 వ్యాజ్యాలను విచారణ జాబితాలో ఉన్నత న్యాయస్థానం చేర్చింది.

Day-to-day hearing on pending AP CM Jagan cases in High Court
జగన్ అక్రమాస్తుల పెండింగ్ కేసులు

By

Published : Oct 28, 2021, 4:51 AM IST

ఏపీ సీఎం జగన్​ అక్రమాస్తుల పెండింగ్ కేసులపై రోజు వారీ విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలు త్వరగా తేల్చాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టారు. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ వైఎస్ జగన్ దాఖలు చేసిన పిటిషన్లతో సహా 2012 నుంచి దాఖలైన సుమారు 40 వ్యాజ్యాలను నేటి విచారణ జాబితాలో ఉన్నత న్యాయస్థానం చేర్చింది.

నిన్న పలు పిటిషన్లపై జరిగిన విచారణలో వారం రోజులు గడువు ఇవ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. అయితే ఈ కేసులు చాలా కాలంగా పెండింగ్​లో ఉన్నాయని.. ప్రజా ప్రతినిధులకు సంబంధించిన వ్యాజ్యాలు త్వరగా తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని న్యాయమూర్తి గుర్తు చేశారు. న్యాయవాదులు వాదనలకు సిద్ధంగా ఉండాలని.. కేసుల వారీగా పిటిషన్లపై రోజూ విచారణ చేపడతాని పేర్కొన్నారు. హెటిరో కేసులో స్టే పొడిగించాలని న్యాయవాది కోరగా నిరాకరించిన హైకోర్టు.. రేపు ఆ పిటిషన్​పై విచారణ చేపడతాని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details