తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గవర్నర్​ కుమార్తె

గత జీహెచ్​ఎంసీ ఎన్నికలకు.. ఈ ఎన్నికలకు చాలా తేడా ఉందని హిమాచల్​ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అన్నారు. భాజపా తరుపున ప్రచారంలో పాల్గొన్న ఆమె.. ఈసారి భాజపా ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Daughter of the governor bandaru dattatreya involved in the ghmc election campaign
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గవర్నర్​ కుమార్తె

By

Published : Nov 28, 2020, 10:20 PM IST

ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న గవర్నర్​ కుమార్తె

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో భాజపా తన ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది. ముషీరాబాద్ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలనే కృత నిశ్చయంతో పార్టీ జాతీయ నాయకులు, మంత్రులను ప్రచార బరిలోకి దింపారు.

ప్రధానంగా హిమాచల్​ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు కూడా మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగస్వాములవుతున్నారు. తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అనేక డివిజన్లలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ కుమార్తె విజయలక్ష్మి ప్రచారం చేశారు.

భాజపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు చాలా తేడాలున్నాయని.. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయాలని కోరారు.

ఇదీ చూడండి :జోరుమీదున్న భాజపా... రంగంలోకి అమిత్​ షా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details