అదనపు కట్నం కోసం ఇంట్లో నుంచి వెళ్లగొట్టారంటూ సోమవారం రాత్రి నుంచి మౌనిక తన అత్తింటి ముందు నిరసనకు దిగింది. సీతాఫల్‌మండి నామాలగుండుకు చెందిన మౌనిక... సికింద్రాబాద్ అడ్డగుట్టకు చెందిన అనిల్ కుమార్కు ఐదేళ్లక్రితం వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 4 లక్షల కట్నం.. 14 తులాల బంగారు ఆభరణాలు.. గృహోపకరణ వస్తువులు అత్తింటికి సమర్పించినట్టు బాధితురాలు తెలిపింది.
అత్తింటి ఎదుట కోడలి పోరాటం - అదనపు కట్నం వేధింపులతో అత్తింటి ముందు కోడలు నిరసన
పిల్లలతో అత్తింటి ముందు కూర్చుని తనను ఇంట్లోకి రానివ్వండంటూ ఓ వివాహిత వేడుకుంటోంది. సికింద్రాబాద్ తుకారంగేట్ పీఎస్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
![అత్తింటి ఎదుట కోడలి పోరాటం daughter in law Protest in front of mother-in-law's house in secunderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7349404-121-7349404-1590472334106.jpg)
అదనపు కట్నం వేధింపులు... అత్తింటి ముందు కోడలి నిరసన
ఏడాది తర్వాత నుంచి అదనపు కట్నం తేవాలంటూ వేధించడం మొదలుపెట్టారని.. వివాహేతర సంబంధం అంటగట్టి చిత్రహింసలు పెట్టారంటూ మౌనిక ఆవేదన వ్యక్తం చేసింది. పెద్దలతో ఎన్ని పంచాయితీలు పెట్టి రాజీ కుదిర్చినా లాభంలేక పోయిందని.. వారి ప్రవర్తనలో మార్పు లేదంటూ వాపోయింది. తనకు న్యాయం జరిగేంత వరకూ ఇంటిముందు నుంచి కదిలేది లేదంటూ మౌనిక స్పష్టం చేసింది. పోలీసులు మౌనిక భర్త, మామను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఇవీ చూడండి:మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!