మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్‌పేయీకి దేశ ప్రయోజనాల కోసం అన్ని భావజాలాలను ముందుకు తీసుకెళ్లే అద్భుతమైన సామర్థ్యం ఉందని హిమాచల్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. అది బలమైన ప్రజాస్వామ్యానికి అవసరమని పేర్కొన్నారు. శుక్రవారం వాజ్‌పేయి జన్మదినం సందర్భంగా ‘'సుశాసన్ దివాస్'’ కార్యక్రమానికి దత్తాత్రేయ అధ్యక్షత వహించారు. ఉదారవాద ఆలోచన, ప్రజాస్వామ్య ఆదర్శాలకు వాజ్‌పేయీ కట్టుబడి ఉంటారని దత్తాత్రేయ అన్నారు. ఆయన ప్రవర్తన, సమర్థవంతమైన పని శైలి ప్రభుత్వ ఉద్యోగులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన ప్రజాదరణ పార్టీ, రాజకీయ సరిహద్దులకు మించి ఉందని కొనియాడారు.
భారత్‌ను నూతన శక్తిగా