హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ... చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని దర్శించుకున్నారు. దంతేరస్ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గవర్నర్ దత్తాత్రేయకు స్వాగతం పలికారు. భాగ్యలక్ష్మీ ఆలయ అమ్మవారు.. భక్తుల కొంగు బంగారంగా నిలుస్తోందని దత్తాత్రేయ అన్నారు. ఇక్కడ లక్ష్మీ పూజ నిర్వహిస్తే... ఎంతో మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
"భక్తుల కొంగు బంగారం... భాగ్యలక్ష్మీ అమ్మవారి దర్శనం" - హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ
హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయాన్ని హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ దర్శించుకున్నారు.
భక్తుల కొంగు బంగారం భాగ్యలక్ష్మీ అమ్మవారు: దత్తాత్రేయ
TAGGED:
బండారు దత్తాత్రేయ