తెలంగాణ

telangana

ETV Bharat / state

అయోధ్య రామమందిరానికి నెల జీతం విరాళమిచ్చిన దత్తాత్రేయ - ayodhya latest updates

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ నెల జీతం విరాళమిచ్చారు. ఈ మేరకు రూ. 1,83,750 చెక్కును 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​ ప్రతినిధులకు అందించారు.

అయోధ్య రామమందిరానికి నెల జీతం విరాళమిచ్చిన దత్తాత్రేయ
అయోధ్య రామమందిరానికి నెల జీతం విరాళమిచ్చిన దత్తాత్రేయ

By

Published : Jan 16, 2021, 5:44 PM IST

అయోధ్యలో తలపెట్టిన శ్రీరామచంద్రమూర్తి మందిర నిర్మాణానికి నెల జీతం విరాళంగా ఇచ్చారు హిమాచల్ ప్రదేశ్​ గవర్నర్ దత్తాత్రేయ. రూ. 1,83,750 చెక్కును 'శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్​ ప్రతినిధులకు అందించారు. హిమాచల్ పర్యటనలో భాగంగా విచ్చేసిన భయ్యాజీ జోషిని బండారు దత్తాత్రేయ టెలిఫోన్ ద్వారా పలకరించారు.

ఇరువురి మధ్య ఆద్యంతం అయోధ్యలో తలపెట్టిన శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణానికి గురించి చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో దత్తాత్రేయ తన నెల జీతాన్ని రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇచ్చినందుకు జోషి సంతోషం వ్యక్తం చేశారు. బండారు దత్తాత్రేయ భయ్యాజీ జోషిని రాజ్​భవన్​కు విచ్చేసి ఆతిథ్యం స్వీకరించాల్సిందిగా కోరారు.

ఇదీ చదవండి :భవిష్యత్​కు ఆశాకిరణం.. కొవిడ్ వ్యాక్సిన్ : మంత్రి కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details